కామంతో ఊగిపోయిన వీఆర్ఏ.. బాలికపై కన్నేసాడు.. కానీ చివరికి..?

praveen
మహిళలపై రోజురోజుకు అత్యాచార ఘటనలు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎన్ని కఠిన  చట్టాలు తీసుకొచ్చినా ఎన్ని కఠిన శిక్షలు విధించినప్పటికీ ఎవరిలో భయం  మాత్రం కనిపించడం లేదు. కామంతో ఊగిపోయి ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో తెర మీదకు వస్తున్నాయి. దీంతో ఆడపిల్ల జీవితం రోజురోజుకు ప్రశ్నార్థకంగా మారిపోతోంది. రోడ్డు మీద వెళ్తే ఆకతాయిల నుంచి... చదువుకోడానికి వెళ్తే గురువుల నుంచి... వైద్యం కోసం వెళ్తే డాక్టర్ల నుంచి... చివరికి సొంత వారి నుంచి... లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ మహిళల పట్ల సభ్యత్వతో  వ్యవహరించే మనుషులు కనిపించడం లేదు.




 కామంతో కళ్లు మూసుకుపోయి తాము ఏం చేస్తున్నామో  అన్న విషయాన్ని కూడా మరిచి  చివరికి దారుణాలకు పాల్పడుతున్నారు. చివరికి కామాంధుల బారినపడి అభం శుభం తెలియని చిన్నారులు సైతం చింద్రం అయిపోతున్నారు. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శుభం తెలియని చిన్నారిపై వీఆర్ఏ అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రజలకు సహాయం చేయాల్సిన వీఆర్ఏ నీచ బుద్ది చూపి  చివరికి బాలిక పై అత్యాచారం చేశాడు. కడప జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన... నాగమయ్య అనే 45 ఏళ్ల వ్యక్తి వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు.




 సదరు వ్యక్తి సమీపంలో ఉన్న 9 ఏళ్ల బాలిక పై కన్నేశాడు. రాత్రి సమయంలో కామంతో ఊగిపోయిన సదరు వ్యక్తి ఇంటి ముందు బాలికకు మాయమాటలు చెప్పి.. సమీపంలో ఉన్న ఆలయ వెనుక ప్రాంతంలోకి తీసుకెళ్లి అక్కడ బాలికపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ బాలిక అరుపులు విని స్థానికులు అక్కడికి వచ్చి చూడగా ఘోరాన్ని చూసి షాక్ అయ్యారు. దీంతో అతనికి దేహశుద్ధి చేసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నాగమునయ్య  పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: