పేర్ని వారసుడు చాలానే చేస్తున్నాడే...
ఇలా ప్రతి విషయంలోనూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ ప్రజల కష్టాల్లో పాలు పంచుకుంటున్న మంత్రి వారసుడు ఎవరో కాదు. రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) కుమారుడు పేర్ని కృష్ణమూర్తి(కిట్టు). నాని మూడో సారి కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, జగన్ కేబినెట్లో రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
అయితే మామూలుగా ఎమ్మెల్యేగా ఉంటే పేర్ని నియోజకవర్గంపై ఎక్కువ దృష్టి పెట్టి పనులు చేసుకుంటూ వెళ్ళేవారు. కానీ ఇప్పుడు మంత్రి కావడం వల్ల ఆయన రాష్ట్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వచ్చింది. అలా అని నియోజకవర్గాన్ని ఏమి పట్టించుకోకుండా ఉండరు. ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి, నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు. ఇక నాని కుమారుడైతే నిత్యం నియోజకవర్గంలో సమస్యలని తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.
నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు, పథకాలు ఇలా ఏ సమస్యలు ఉన్న వెంటనే పరిష్కారం అయ్యేలా చూస్తున్నారు. ఇక నియోజకవర్గ ప్రజలు కూడా తమకు ఏమన్నా సమస్యలు ఉంటే మొదట పేర్ని తనయుడుకే చెప్పుకోవడం విశేషం. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో పేర్ని తనయుడు ముందున్నారు కాబట్టే, ప్రజలు ఆయన ద్వారానే తమ సమస్యలని పరిష్కరించేలా చేసుకుంటున్నారు. ఇక ఈ కరోనా సమయంలో కృష్ణమూర్తి పూర్తిగా ప్రజలకు అండగా నిలబడ్డారు. ఇక్కడ కృష్ణమూర్తి గురించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే..ప్రజలు ఏదైనా సమస్య చెబితే చేద్దాంలే అని అనకుండా, క్షణాల్లో ఆ పని పూర్తయ్యేలా చేస్తూ, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు.