వారెవా.. సోనూసూద్ బొమ్మను నిమిషాల్లో గీసేశాడు..! వీడియో చూడండి..
ఆర్ణబ్ ముఖర్జీ ఓ పెన్సిల్ ఆర్టిస్ట్.. పెన్సిల్తోనే వ్యక్తుల చిత్రాలను అద్భుతంగా గీస్తాడు.. సోనూసూద్ సేవలకు మెచ్చిన ఈ ఆర్టిస్ ఆయన్ను ఓ భగత్ సింగ్తో పోలుస్తూ ఓ చిత్రం గీసాడు. నిమిషాల వ్యవధిలోనే గీసిన ఈ చిత్రం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. తాను గీసిన చిత్రాన్ని ఆయన సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఆ చిత్రం చూసి చివరకు సోనూసూద్ కూడా లవ్ యూ అంటూ మెచ్చుకున్నాడు.
సోనూ సూద్ ఇప్పుడు భారతదేశంలో ఓ క్రేజ్.. ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే వ్యక్తిగా పేరున్న మంచి వ్యక్తి. అందుకే ఆయనకు భాషతో సంబంధం లేకుండా అంతా ఫ్యాన్స్ అవుతున్నారు. ఆయనపై అభిమానం వ్యక్తపరుస్తున్నారు. ఇటీవలే దీపా జయ అనే అభిమాని కూడా ఆయనకు ఓ అపురూపమైన కానుక పంపింది.. జీవం ఉట్టిపడేలా ఆయన పెయింటింగ్ ను రూపొందించి ఆ వీడియోను సోనూసూద్ కు పంపింది. చేసింది.
ఈ పెయింటింగ్ వేయడానికి చాలా కష్టపడ్డాను.. గంటల తరబడి కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తోంది. కానీ మా దేవుడిని గౌరవించుకోవడం మా విధి కదా.. వి లవ్ యు సర్ అంటూ కామెంట్ చేసింది దీపా జయ అనే ఆ అభిమాని. ఆ పెయింటింగ్ చూసి ఫిదా అయిన సోనూసూద్ కూడా యూ ఆర్ ద బెస్ట్ అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు.. ఇలాంటి ప్రశంసలు ఇటీవలి కాలంలో సోనూసూద్ కు కోకొల్లలుగా వస్తున్నాయి. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఇంతగా ప్రశంసలు పొందిన వ్యక్తి సోనూసూద్ ఒక్కడే కావచ్చు.