పేదలకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో అందరికి..?
ప్రభుత్వాలు ఆదుకోకపోతాయా అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు ఉపాధి కోల్పోయి రోడ్డు మీద పడిన పేద మధ్య తరగతి కుటుంబాలు . కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో... ఉపాధి కోల్పోయిన వారి పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోయింది. కుటుంబ పోషణ భారమై రోజురోజుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఉపాధి కోల్పోయిన వారందరికీ ఉపాధి కల్పించేందుకు కేంద్రం నిర్ణయించింది .
ఉపాధి కోల్పోయిన నిరుపేదలు అందరికీ శుభవార్త చెప్పారు. దేశంలోని చిన్న చిన్న పట్టణాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేసే దిశగా ఆలోచిస్తున్నామని అర్బన్ అఫైర్స్ జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్ తెలిపారు. కరోనా వైరస్ కారణంగా పట్టణాల్లో చాలామంది తమ ఉపాధిని కోల్పోయారు అంటూ తెలిపిన ఆయన... ప్రస్తుతం ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని త్వరలో తీసుకురానున్నామని తెలిపారు. మొత్తంగా ఈ పథకం అమలు కోసం మొదటగా 35 వేల కోట్లు అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని... గత సంవత్సరం నుంచి ప్రభుత్వం దీనిపై కసరత్తులు చేస్తోంది అంటూ తెలిపారు.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రస్తుతం ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ భారంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే అవకాశం ఉంది.