చైనాలో ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాలు.. అవన్ని దాచిన రహస్యాలు.?
అయితే చైనాలో కరోనా గణాంకాలు పై అమెరికా ఎప్పటినుంచో అనుమానాలు వ్యక్తం చేస్తూనే వస్తున్న విషయం తెలిసిందే. అమెరికాలో 6 మిలియన్ల మందికిపైగా వైరస్ బారిన పడగా 1.8 లక్షల మంది చనిపోయారు. బ్రెజిల్లో 1.22 లక్షల మంది చనిపోయారు. భారత్లో 66 వేల మందికి పైగా కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన దేశాలలోనే ఈ రేంజిలో మరణాలు కేసుల సంఖ్య ఉంది.. మరి చైనాలో మాత్రం అంత తక్కువ ఎలా అనే అనుమానాలు ప్రపంచ దేశాల్లో నెలకొన్నాయి.
ఈ క్రమం లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా ప్రపంచ దేశాలపై చైనా ప్రయోగించిన ఒక బయో వెపన్ అంటూ విమర్శలు చేశారు. అంతేకాకుండా చైనా కు ముందుగానే కరోనా వైరస్ గురించి తెలిసినప్పటికీ నిజాలను దాచిపెట్టి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందేలా చేసింది అంటూ విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. అయితే తాజాగా మరోసారి చైనా పై విరుచుకుపడిన డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ నేపథ్యంలో చైనా చూపించిన లెక్కలు అన్ని అవాస్తవం అంటూ తెలిపారు. చైనాలో ఏకంగా లక్షకుపైగా కరోనా మరణాలు ఉన్నాయి అని వ్యాఖ్యానించిన ట్రంప్ .. నిజాలను చైనా దాస్తుంది అంటూ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక మరణాలు కేసులు ఒక చైనా లో మాత్రమే ఉన్నాయని కానీ చైనా ఈ విషయాలను బహిర్గతం చేయడం లేదు అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని సంతరించుకున్నాయి.