చైనా సైన్యం ప్రస్తుత పరిస్థితి మింగలేక కక్కలేక ఉంది?
ఇప్పటికిప్పుడు చైనా సైన్యంతో, మన సైన్యానికి రెండింతలు సైన్యంతో మన సరిహద్దుల్లో పొంచి ఉన్నారు. వారు ఇప్పటికే చెప్పిన ప్రకారం భారత్ మా సైన్యం ధాటికి నిలవలేదు, మా దగ్గర కుంగ్ పు ఫైటర్స్ మరియు మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరిన వారు ఉన్నారు. కానీ ఒకప్పుడు వారు చెప్పినట్లుగా అన్ని రకాల విద్యలలో ఆరితేరినవారుండేవారు. కానీ ప్రస్తుతం వారి దగ్గర ఉన్న వారు అంతా తాతయ్యలు, జేజేమ్మలు మాత్రమే ఉన్నారు. మనకు సపోర్టు గా ఉన్న టిబెటన్ టీం, గుర్ఖా టీం గా పిలువబడే నేపాలీ టీం మరియు బీహార్ రెజిమెంట్ కి సంబంధించిన ఘాతుఖ్ టీం సరిహద్దుల్లో పొంచిఉన్నారు. వీరు ఎలా ఉంటారంటే "ఎగిరి గొంతు కోసేస్తారు" అంత ప్రమాదం వీరు. చైనా సైనికులు చూడడానికి పొట్టిగా ఉండడం వలన భారత సైనికులను వీరు పట్టుకునేలోపే మన వాళ్ళు వేసేస్తారు. వీరిని మనవాళ్ళు పిల్లకాయల్లాగా ట్రీట్ చేస్తారు, "ఏమిరా పొట్టోడా సమోసా తింటావా" అలా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. మొన్న జరిగిన తోపులాటలో కూడా ఇదేవిధముగా మాట్లాడినట్టు సమాచారం.
ఇప్పుడు వాళ్ళు ఆయుధాలు తీసుకుంటే యుద్దానికి సిద్దమైనట్టే, ఒకవేళ వారు యుద్దానికి సై అంటే, వారి పని మన భారత సైనికుల చేతుల్లో ఖతం. దీనికి ఉదాహరణగా పైన మనము చెప్పిన ఉదాహరణలు. అంతేకాకుండా ప్రపంచదేశాలన్నీ కూడా చైనా కు వ్యతిరేకంగానే ఉన్నాయన్న విషయం వారికి తెలిసిందే. ఇప్పుడు యుద్ధమే తప్పదు అంటే చైనా మీద ఎప్పటినుండో ఉన్న కసిని తీర్చుకోవడానికి టిబెటన్ టీం రెడీ గా ఉంది. వాళ్ళు ఇంత దారుణమైన జీవితం అనుభవిస్తున్నారంటే దానికి కారణం చైనా చేసిన ఘాతుకమే.అన్నింటికన్నా ముఖ్యమైనది మనమంతా గర్వపడాల్సిన విషయం ఏమిటంటే భారత సైనికుడు ఒకసారి బోర్డర్ కి వచ్చిన తర్వాత చావు గురించి ఆలోచించడు. అదే చైనా సైనికులలో చూస్తే వారికి యుద్ధం చేయాలి కానీ మరణం ఉండకుడదు అని అనుకుంటారు. ప్రతి చైనాసైనికుడి ఇంట్లో కూడా వారి పేరెంట్స్ లేదా భార్య "మాకు మీరొక్కరే ఉన్నారు... జీవించి ఉండమని చెప్తారట".