కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్న 76 శాతం మంది ప్రజలు!

Suma Kallamadi
భారత దేశ వ్యాప్తంగా ప్రతి ఏడాది వేలమంది ప్రజలు ఆత్మహత్య చేసుకుంటారు. కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు కానీ ఆత్మహత్యల సంఖ్య భారతదేశంలో గణనీయంగా పెరగడం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 516 ఆత్మహత్యలు నమోదు కాగా వాటిలో 394 ఆత్మహత్యలు కుటుంబ సమస్యలకు సంబంధించినవేనని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. గణాంకాల ప్రకారం ఆత్మహత్యకు పాల్పడిన వారిలో 76 శాతం మంది కుటుంబ సమస్యలతోనే బలవన్మరణానికి పాల్పడ్డారు అని చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాను 394 మందిలో 260 మంది మగవాళ్ళు ఉండగా 134 మంది ఆడవారు ఉన్నారు.


భారత దేశ వ్యాప్తంగా కుటుంబ సమస్యలతో చనిపోయిన వారిలో ఎక్కువగా ఉత్తరాఖండ్ రాష్ట్రం లోనే ఉన్నారని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. ఓ ప్రముఖ వార్తా పత్రిక ప్రకారం కుటుంబ తగాదాలతో లేదా కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఒడిస్సా రాష్ట్రంలో 60 శాతం మంది చనిపోయారని... త్రిపుర రాష్ట్రం లో 55.4 శాతం మంది ప్రజలు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2018వ సంవత్సరంలో పోల్చుకుంటే 2019 సంవత్సరంలో 22% ఆత్మహత్యల రేటు పెరిగిందట. 2018 వ సంవత్సరం లో ఉత్తరాఖండ్ రాష్ట్ర వ్యాప్తంగా 421 మంది ప్రాణాలను తీసుకున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. ప్రేమ సంబంధిత సమస్యలతో 35 మంది వ్యక్తులు చనిపోగా వారిలో 22 మంది మగవాళ్ళు కాగా 13 మంది ఆడవాళ్ళు. జీవితంలో సెటిల్ కాలేదనే వివాహం జరగడం లేదని 35 మంది వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. భద్రకాళి రాష్ట్రంలో 2019 వ సంవత్సరం మొత్తంలో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకపోవడం హర్షించదగిన విషయమని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. కానీ 54 మంది విద్యార్థులు 83 మంది నిరుద్యోగులు మానసిక ఒత్తిళ్లతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.


గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని... కుటుంబ సభ్యులు ప్రతిక్షణం ఒకరిని ఒకరు పర్యవేక్షించాలని... బాధలో ఉన్న వారిని ఆదుకుని అండగా నిలవాలని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. నేటి కాలంలో అందరూ కూడా మొబైల్ ఫోన్స్ యదేచ్ఛగా ఉపయోగిస్తారు. సోషల్ మీడియాలో సమయాన్ని గడుపుతూ కుటుంబ సభ్యులకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. టెక్నాలజీని మంచి పనులకు వినియోగించాలి కానీ జీవితాలను సర్వనాశనం చేసుకునేలా ఉపయోగించకూడదని ఉత్తరాఖండ్ జనరల్ డైరెక్టర్ అశోక్ కుమార్ వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: