అప్పటి వరకు పవన్ పవర్ స్టారేనా ? జనసేనాని కాదా ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయం గా  మరింత యాక్టివ్ అవ్వాలని ప్రజల్లో బలం పెంచుకోవాలని జనసైనికులు కోరుకుంటున్నారో లేదో తెలియదు గాని, బిజెపి నేతలు మాత్రం బాగా కోరుకుంటూ వస్తున్నారు. పవన్ కు అభిమానుల బలం, సామాజిక  వర్గం అండదండలు పుష్కలంగా ఉండడంతో, తమ రాజకీయ ఎత్తులతో అధికారంలోకి తీసుకు రావచ్చు అని, బిజెపి జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, బీజేపీ నేతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోము వీర్రాజు మొదట్లో ఈ ఫార్ములాను తెరపైకి తెచ్చి యాక్టివ్ గా వ్యవహరించారు.


 కానీ పవన్ నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో, బీజేపీ నేతలు పవన్ పై గుర్రుగా ఉండడంతో పాటు, సొంతంగా  ఏపీలో బలం పెంచుకోవాలనే ఉద్దేశంతో,  ముందుకు వెళ్తున్నట్లుగా కనిపిస్తున్నారు. అసలు బీజేపీ ఇచ్చిన ఆఫర్ పై  పవన్ నిర్లక్ష్యంగా ఉండడానికి కారణం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. అసలు పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది, ఆ పార్టీ సహకారంతో 2024 ఎన్నికల్లో బిజెపి జనసేన కలిపి అధికారంలోకి రావాలని. కానీ, ఇప్పుడు పవన్ సైలెంట్ అవ్వడానికి కారణం సినిమాలు అన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ సినిమాల పైనే ఎక్కువ దృష్టి పెట్టారు. 


వరుసగా సినిమాలకు సంతకాలు చేస్తూ, ముందుకు వెళ్తున్నారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఆరు సినిమాలకు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. 2024 నాటికి జనసేనకు ఆర్థికంగా లోటు లేకుండా చేయాలనే ఉద్దేశంతో, సినిమాలను ఒప్పుకున్నట్లు జనసేన లోని కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన పార్టీ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడంతో, పవన్ పొలిటికల్ ఇమేజ్ బాగా తగ్గిపోయింది. ఈ క్రమంలో సినిమా అవకాశాలు ద్వారా మళ్లీ తన క్రేజ్ పెంచుకుని రాజకీయాల్లో స్పీడ్ ఎ అయితే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి అనేది అభిప్రాయంగా తెలుస్తోంది. 

అయితే ఇప్పటికీ పవన్ పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తున్నారనే విమర్శలు ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించడం, ఆ విమర్శలకు మరింత బలం చే కూర్చున్నట్లుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: