తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుకు కరోనా?
తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో.... ప్రజా ప్రతినిధిగా ప్రజల సంక్షేమం కోరే ఈయన ఇటువంటి కష్ట సమయంలో కూడా తన తోటి వారి క్షేమం కోరుతూ తనతో కాంటాక్టు లో ఉన్న వారందరినీ టెస్ట్ చేసుకోవాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు మొత్తం హోమ్ క్వారంటైన్ కి వెళ్లారు.. అలాగే ప్రజలు కరోనా బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరోసారి హెచ్చరించినట్లు సమాచారం.
అయితే ఈ విషయంపై అధికారకంగా ఎటువంటి ప్రకటన ఇంకా రాలేదు. హరీష్ రావు నివాసంలో ఓ వ్యక్తికి కోవిడ్ 19 పాజిటివ్ నిర్ధారణ కావడంతో హోమ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. నిన్న ప్రగతి భవన్ లో సీఎం మంత్రులతో అసెంబ్లీ బేటి లో చర్చకు పాల్గొన్నారు హరీష్... దీంతో ఆ చర్చలో పాల్గొన్న వ్యక్తులను గృహనిర్బంధంలో కి పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హరీష్ రావు కుటుంబం త్వరగా కరోనా నుండి కోలుకొని ప్రజలకు కరుణ గురించి తగు సూచనలు జాగ్రత్తలు ఇవ్వాలని అని మనం కూడా కోరుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయా? అని ఆలోచనలో పడ్డారు ప్రభుత్వ వర్గాలు.