టిక్ టాక్ ప్రియులకి గుడ్ న్యూస్.. త్వరలో..?

praveen
ఆన్ లైన్  షార్ట్ వీడియో ఎంటర్టైనింగ్ యాప్ టిక్ టాక్ కి భారత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత నెటిజన్లు అందరిని ఉర్రూతలూగించి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ పంచింది టిక్ టాక్. ఎంతో మంది గంటలపాటు టిక్ టాక్ లో మునిగితేలిన వారు కూడా ఉన్నారు. అయితే ఇటీవలే భద్రత పరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయం కారణంగా టిక్ టాక్  భారత్ లో  నిషేధానికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో రెండు మూడు దేశాలు కూడా టిక్ టాక్ ను తమ దేశంలో బ్యాన్  చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.  అయితే భారత్ లో  టిక్ టాక్ బ్యాన్ కావడంతో ఎంతో మంది గుండెల్లో బాంబు పేలినంత  పని అయింది అనే చెప్పాలి.



 టిక్ టాక్ ద్వారా ఫేమస్ సెలబ్రిటీ హోదాను సంపాదించిన ఎంతోమంది టిక్ టాక్  నిషేధానికి గురి కావడంతో నిరాశలో  మునిగిపోయారు. ఆ తర్వాత రోజుల్లో టిక్ టాక్  యూజర్లు  ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకున్న  విషయం తెలిసిందే. అందరిలో మళ్లీ టిక్ టాక్ వస్తే బాగుండు అనే ఆశ మాత్రం చావలేదు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే త్వరలో టిక్ టాక్ భారత్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే టాక్ వినిపిస్తోంది. చైనా కంపెనీ కావడంవల్ల టిక్ టాక్ ను భారత్ బ్యాన్  చేసిన విషయం తెలిసిందే.


 కాగా ప్రస్తుతం టిక్ టాక్ యాప్ ను జపాన్ కు  చెందిన సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతి పెద్ద మార్కెట్ కలిగిన భారతీయ భాగస్వామి కోసం తీవ్రంగా వెతుకులాట ప్రారంభించిందట సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్. ఇప్పటికే రిలయన్స్ జియో,  భారతీ ఎయిర్ టెల్ లాంటి కంపెనీలతో కూడా టిక్ టాక్  కొనుగోలులో భాగస్వామి కోసం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు కనుక విజయవంతమైతే త్వరలో టిక్ టాక్  అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టిక్ టాక్ ప్రియులందరికీ ఇది  శుభవార్తే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: