చైనా కు భారీ షాక్.. భారత్ కి తోడుగా మరో దేశం..?

praveen
శత్రువుకు శత్రువు మిత్రుడు అంటూ ఉంటారు.. ప్రస్తుతం భారత్-చైనా సరిహద్దుల్లో ఘర్షణ  నేపథ్యంలో ఇలాంటి పరిణామాలే  చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చైనాతో శత్రుత్వం ఉన్న అన్ని దేశాలు భారత్ కు అండగా నిలిచేందుకు ఎలాంటి సహాయాన్నిఅయినా  చేసేందుకు సిద్ధపడుతున్నారు. రోజురోజుకు భారత్ వైపు అండగా నిలబడుతున్న  దేశాల సంఖ్య ఎక్కువ అవుతుంది. చైనా ను  అన్ని రకాలుగా దెబ్బతీసేందుకు పూర్తిస్థాయి ప్రోత్సాహకాన్ని అందిస్తున్నాయి. ఇలా మొదటి నుంచి చైనాను దెబ్బకొట్టేందుకు భారత్ కు సహకారం  అందిస్తున్న దేశాలలో ఒక  అగ్ర రాజ్యమైన జపాన్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

 ఇదే సమయంలో ఇతర దేశాల నుంచి వస్తున్న అవకాశాలను భారత్ కూడా సమర్థవంతంగా అందిపుచ్చుకుంది. ఇక జపాన్ లో ఉన్నటువంటి సుకోవిచ్ దీవుల  విషయంలో చైనా జపాన్ తో వివాదానికి తెరలేపిన విషయం తెలిసిందే. దీంతో  చైనా ను దెబ్బతీసేందుకు ఏకంగా జపాన్ దేశ బడ్జెట్ నుండి 20 శాతం కేటాయించి మరి చైనాలో జపాన్  దేశానికి సంబంధించిన  కంపెనీలను చైనా  నుంచి బయటకు వచ్చేందుకు సబ్సిడీ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. చైనా నుంచి బయటకు వచ్చి వేరే దేశానికి వెళ్లాలి అంటూ సూచించింది. దీంతో  ఎన్నో కంపెనీల చైనా  నుంచి బయటకు వచ్చేశారు.


 ఇప్పుడు భారత్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది జపాన్  ప్రభుత్వం. చైనా నుంచి బయటికి వచ్చిన కంపెనీలు భారత్ కు వెళ్లేందుకు వారికి మరింత ప్రత్యేకమైన సబ్సిడీని కల్పించేందుకు నిర్ణయించింది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న తరుణంలో ఎన్నో కంపెనీలు భారత్ వైపు వచ్చేందుకు సిద్ధ పడుతున్నాయి. ముఖ్యంగా వైద్య సామగ్రికి సంబంధించిన కంపెనీలతో పాటు ఎలక్ట్రికల్ కంపెనీలకి నేరుగా చైనా నుంచి ఇండియా కి వస్తే వాటికీ సబ్సిడీ ఇస్తుంది జపాన్ . అయితే  జపాన్ పారిశ్రామిక టౌన్ షిప్ లను  కాశ్మీర్, తమిళనాడు, అస్సాం లలో  ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: