ప్రేమ వివాహం.. కానీ ఆరు నెలలకే ఆత్మహత్య.. కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్..?
ఈ ఘటన కొల్చారం మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొల్చారం ఉప సర్పంచ్ లక్ష్మి చెన్నయ్య ల దంపతులకు ఓ కొడుకు కుమార్తె ఉన్నారు. కుమార్తె నవనీత ఇంటర్ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటుంది. ఇక అదే గ్రామానికి చెందిన ఆశన్న గారి లక్ష్మి మల్లేశం లు వీరికి దూరపు బంధువులు కాగా వారి కుమారుడు ప్రశాంత్ నవనీత కు బావ అవుతాడు. కాగా ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్లుగా వీరు ప్రేమలో మునిగి తేలుతున్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలియడంతో... వారు పెళ్లికి అంగీకరించలేదు. ఏదో ఒక విధంగా నవినీత ప్రశాంత్ లు కుటుంబ సభ్యులను ఒప్పించారు.
ఫిబ్రవరి నెలలో వివాహం చేసుకున్నారు. పెద్దల సమక్షంలో వీరి ప్రేమ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక తమ కూతురు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉందని తల్లిదండ్రులు అనుకున్నారు. ఇంతలో నవనీత ఎవరూ ఊహించని విధంగా సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. అయితే వేధింపులు తట్టుకోలేక తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని నవనీత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా నవనీత రాసిన సూసైడ్ నోట్ ప్రస్తుతం అందర్నీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘హాయ్ బావా.. నీకు నేను అంత ఇష్టం లేనట్టుగా ఉంది. నాకంటే నీకు చాలా మంది ముఖ్యమైన వారున్నారు. నాకు ఓడిపోవాలని లేదు బావా.. ఐనా ఈ రోజు ఉదయం 10 గంటలకల్లా నా చావు కబురు వింటావు.. బై బావా సంతోషంగా ఉండు..’ ఐ లవ్ యూ బావా.. అంటూ సూసైడ్ నోట్ రాసింది నవనీత..