'మోడీ, సారూ! మా భవిష్యత్ గురించి ఆలోచించండి' ప్రధానికి లేఖ రాసిన పన్నెండేళ్ల బాలిక

Suma Kallamadi
మొట్టమొదటి ఇంటర్నేషనల్ డే అఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ దినోత్సవం సందర్భంగా 12 ఏళ్ల పర్యావరణ కార్యకర్త భారత ప్రజలందరికీ స్వచ్ఛమైన గాలి అందించేలా చర్యలు తీసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసింది. గాలి కాలుష్యాన్ని తగ్గించకపోతే అందరూ కూడా ఆక్సిజన్ సిలిండర్లను మోయవలసి ఉంటుందని ఆ బాలిక ఆందోళన వ్యక్తం చేసింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్ కి చెందిన 12 ఏళ్ల బాలిక రిథిమా పాండే ప్రధానమంత్రికి రాసిన లేఖలో ఈ విధంగా పేర్కొంది. 'మోడీ సారూ, భవిష్యత్తులో ఎక్కడికి వెళ్ళినా ఆక్సిజన్ సిలిండర్లను మేము మోయకుండా ఉండేందుకు మీరు సహాయం చేయాలి. గాలి కాలుష్యం కారణంగా సిలిండర్లను ప్రతి ఒక్క చోటికి మోయడమనే ఊహ భయంకరమైన పీడకల లాంటిది. 12 ఏళ్ల వయస్సు గల నేనే గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడితే ఢిల్లీ ముంబై వంటి నగరాల్లో నివసించే చిన్న పిల్లలు, పుట్టిన పసిపాపలు పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. భారత దేశ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం గాలి విపరీతంగా కలుషితమవుతుంది. అక్టోబర్ నెల తర్వాత ఊపిరి పీల్చుకోవడానికి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు.  సిటీలలో నివసించే పేద, మధ్య తరగతి వారు గాలి కాలుష్యం వలన అనేక రోగాల బారిన పడుతున్నారు. కొంత మంది ప్రాణాలను కోల్పోతున్నారు.

'భారతదేశ పిల్లలు అందరి తరపున నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు సంబంధిత అధికారుల చేత సరైన చర్యలు చేపట్టాలని ఆదేశించండి. గాలి కాలుష్యాన్ని తగ్గించకపోతే భారత ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది', అని ఆ బాలిక తన లేఖలో పేర్కొన్నారు.

ఇకపోతే ఐక్యరాజ్యసమితి అసెంబ్లీ సమావేశంలో 74 వ సెషన్ లో వాతావరణం చెడిపోకుండా ఉండాలని అందుకోసం ప్రత్యేకంగా ఒక దినోత్సవం ప్రకటించే ప్రజలందరూ గుర్తు చేయాలని 'ఇంటర్నేషనల్ డే అఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్' రోజుకి తీర్మానం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: