కరోనా సోకిన మహిళపై లైంగికదాడి చేసిన అధికారి అరెస్ట్..!

Suma Kallamadi
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లోను అమ్మాయిలపై ఆగడం లేదు. ఇక ప్రస్తుత సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. రోజురోజుకు కామాంధుల వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చిన్న పిల్లల నుండి కాటికి కాలుచాపిన ముసలి వాళ్ళ వరకు అంత కామాంధుల వేధింపులకు గురవుతూనే ఉన్నారు. దేశంలో మహిళల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలను తీసుకొచ్చారు.  అయినప్పటికీ మహిళలకు రక్షణ కరువైతుంది. తాజాగా తిరువనంతపురం కరోనా వచ్చిన మహిళలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ అధికారి.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా సోకి క్వారంటైన్‌లో ఉన్న మహిళపై లైంగికదాడి చేసిన జూనియర్ హెల్త్ ఇన్స్‌స్పెక్టర్‌ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. తిరువనంతపురానికి చెందిన ఒక మహిళకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమె వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆమెకు కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ ఫలితం వచ్చింది. అయితే ఆ సర్టిఫికెట్ ఇస్తానంటూ జూనియర్ హెల్త్ ఇన్స్‌స్పెక్టర్‌ ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నాడు. తన ఇంటికి వచ్చిన ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

అయితే బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని గుర్తించి సోమవారం అరెస్ట్ చేశారు. కాగా, పఠనంథిట్టలో కరోనా పాజిటివ్ మహిళపై అంబులెన్స్ డ్రైవర్ లైంగికదాడికి పాల్పడిన ఘటనపై ఆ రాష్ట్రంలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనికి బాధ్యత వహించి ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజా తన పదవికి రాజీనామా చేయాలని ఆ రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా మోర్చా సభ్యులు డిమాండ్ చేశారు. ఇక మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: