మోసపోయాను.. అతడే కారణం.. చెన్నై పోలీసులను ఆశ్రయించిన హర్భజన్.?
ఎన్నిసార్లు అడిగినా సమాధానం దాటవేస్తూ ఉన్నాడు అంటూ పోలీసులకు తెలిపాడు హర్భజన్ సింగ్. ఇక ఈ విషయం పై ఇటీవల చెన్నై పోలీసులను ఆశ్రయించాడు హర్భజన్. అయితే దీనిపై వెంటనే స్పందించిన ఏసిపి అప్పు తీసుకొని మోసం చేసిన వ్యాపారి మహేష్ కు సమన్లు జారీ చేశారు. కాగా ఈ వ్యవహారం మద్రాస్ హైకోర్టు వరకు వెళ్ళింది. ఈథర్ ఈ ఏడాది హర్భజన్ ఐపీఎల్ నుంచి దూరం కావడం వల్ల 2 కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తాను అప్పుగా ఇచ్చిన మొత్తాన్ని న్యాయ పోరాటం చేసి స్వాధీనపర్చుకుంటాను అంటూ హర్భజన్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే అంతకుముందు సీఎస్కే జట్టు నుంచి స్టార్ ఆటగాడు అయినా సురేష్ రైనా తప్పుకుని అందరికీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకున్న సమయంలోనే మరో స్టార్ ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటన చేయడం సంచలనం రేపింది. అయితే వ్యక్తిగత కారణాల వల్లే తాము ఐపీఎల్ నుంచి నిష్క్రమించ వలసి వచ్చింది అంటూ ఇద్దరు ఆటగాళ్ళు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ అభిమానులు మాత్రం వీరి షాకింగ్ నిర్ణయం తో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.