ఇకపై మనుషులు కాదు.. అన్ని డ్రోన్ లే..?

praveen
ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యం లో సామాజిక దూరం అనివార్యం మారిన  విషయం తెలిసిందే. ఈ నేపథ్యం లో పలు రిటైల్ సంస్థలు కీలక నిర్ణయా లు తీసుకుంటూ.. మనుషుల మధ్య ఎలాంటి కాంటాక్ట్ లేకుండానే సరుకుల ను వివిధ ఆర్డర్ లను  డెలివరీ చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి జరుగకుండా ఉండేందుకు కస్టమర్ల కు తమ సర్వీస్ ప్రొవైడర్ లకు మధ్య సామాజిక దూరం ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ప్రపంచ ప్రఖ్యాత రిటైల్ దిగ్గజం సంస్థ వాల్ మార్ట్  కీలక నిర్ణయం తీసుకుంది.




 ప్రస్తుతం తమ కస్టమర్ల కు  అందిస్తున్న సేవలను మరింత మెరుగు పరుచుకుంటూ మరో అడుగు ముందుకు వేసింది వాల్ మార్ట్ సంస్థ. మొన్నటి వరకు వివిధ వాహనాల ద్వారా లేదా... మనుషుల ద్వారా సరుకులను తమ కస్టమర్ల కు సరఫరా చేసేవారు. కానీ ఇక నుంచి ఇవన్నీ కనిపించకపోవచ్చు. ఎందుకంటే త్వర లో డ్రోన్ ల  ద్వారా నిత్యావసర సరుకుల ను సరఫరా చేయడాన్ని ప్రారంభించింది వాల్ మార్ట్ సంస్థ. అమెరికా నార్త్ కరోలినా లోని సెంటర్ ల్లాస్  లో.. ముందుగా ఈ ఫైలెట్  ప్రాజెక్టును ప్రారంభించింది .




 ప్రముఖ డెలివరీ సంస్థ ఫ్లైట్రిక్స్ తో కలిసి ఆటోమేటెడ్ డ్రోన్ల ద్వారా నిత్యావసర సరుకులను తమ కస్టమర్ల కు ఇంటికి చేర్చేందుకు నిర్ణయించింది. కాగా ఇప్పటికే డ్రోన్లు ఎంతోమంది కస్టమర్ల కు నిత్యావసర సరుకులను ఇంటికి సరఫరా చేస్తున్నాయి. ఇటీవలే మరో ప్రకటన విడుదల చేసింది వాల్-మార్ట్. రానున్న రోజుల్లో మిలియన్ల ప్యాకేజీల ను ఆటోమేటెడ్ డ్రోన్ ల ద్వారానే డెలివరీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి తెలిపింది. ప్రస్తుతం కరోనా  వైరస్ నేపథ్యం లో ఈ డ్రోన్ల ద్వారా డెలివరీ కస్టమర్లకు ఎంతగానో  ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: