కంగనా ఖంగు మనిపించే మాటల ధోరణి ఏ మాత్రం మారలేదు..... మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మెసేజ్ ల వర్షం కురిపిస్తూనే ఉంది.
ఈ సారి
శివసేన కు బ్రేక్ ఇచ్చి ఆ ప్లేస్లో మహరాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఉన్న కాగ్రెస్ను
కంగనా టార్గెట్ చేసింది. ఆ
పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో బాణాలు విసురుతోంది. మహారాష్ట్రలో మీ ప్రభుత్వం నా పట్ల వ్యవహరిస్తున్న తీరు సాటి మహిళగా మిమ్మల్ని బాధించడం లేదా....ఓ
ఆడపిల్ల పై ఏమాత్రం జాలి కలగదా.. అంటూ సోనియాగాంధీని ముక్కు సూటిగా ప్రశ్నించింది.
ఓ
మహిళ పట్ల మహరాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మీకు పట్టదా... ఇదేనా మీరు చూపే మానవత్వం...
మహిళ పై జరుగుతున్న అన్యాయానికి సాటి మహిళగా....అందులోనూ ప్రముఖ
లీడర్ అయ్యుండి..!! ఇలా చూసి చూడనట్టు వదిలేస్తారా..??? అంటూ బాలీవుడ్ నటి
కంగనా రనౌత్
కాంగ్రెస్ అధ్యక్షురాలు
సోనియా గాంధీని ప్రశ్నించింది. ఉన్నత పదవిలో ఉన్న మీరు ఒక నాయకురాలిగా,..... రాజ్యాంగ
నిర్మాత డా. అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగ సూత్రాల ప్రకారం నడుచుకోవాలని మీరు ప్రభుత్వానికి సూచించలేరా? వారికి మహిళలతో ఎలా మెలగాలో నేర్ప లేరా..? మీరు పేరుకి విదేశాల్లో పెరిగినా… భారత్లో నివసిస్తున్న ఒక పౌరురాలు... ఓ
మహిళ చేస్తున్న న్యాయ పోరాటం గుర్తించరా? గుర్తించిన మాట్లాడలేరా...? మీరు పాటిస్తున్న మౌనం
చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది.
చరిత్ర మిమ్మల్ని అంత ఈజీగా క్షమించదు...!!!
మీ సొంత ప్రభుత్వమే ఓ మహిళను తీవ్రంగా వేధిస్తుంటే వేడుక చూస్తున్నారు...!! అంటూ భావోద్వేగానికి గురై సంచలన వ్యాఖ్యలు చేసింది కంగన. ఓ
మహిళ ఇలా మీ ముందు వేదన పడుతుంటే ఇప్పటికైనా చలించండి.... ఇప్పుడైనా కనులు తెరచి సర్కారు చేస్తున్న ఈ అరాచకాలపై కలగ చేసుకుంటారని భావిస్తున్నాననంటూ
కంగనా వరుస మెసేజ్ లు చేసింది. మరి ఇప్పుడు
కంగనా ప్రశ్నలకు
కాంగ్రెస్ అధ్యక్షురాలు
సోనియా గాంధీ నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి..