ఆలయంలో పూజారులను హత్య చేసిన దుండగులు..!

Suma Kallamadi
కరోనా క్లిష్ట పరిస్థితుల్లో చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో జీవనం సాగించడానికి కొంతమంది దొంగలుగా మారుతున్నారు. వరుసకు సోదరులైన గణేష్, ప్రకాష్, ఆనంద్ అనే ముగ్గురు వ్యక్తులు మాండ్య జిల్లాలోని గుట్టలు ప్రాంతంలో ఉన్న శ్రీ అరకేశ్వర ఆలయంలో పూజారులుగా పనిచేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలోనే నివాసం ఉండే వాళ్లు రాత్రి వేళల్లో అక్కడే నిద్రపోయేవారు. ముగ్గురు పూజారులను ఒకేసారి హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది.

ఇక ఆలయంలో దొంగతనం కోసం వచ్చిన దుండగులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆలయం వెలుపల ఓ చోట చిందర వందరగా పడి ఉన్న మూడు హుండీలను చిందర వందరగా ఉండటం పోలీసులు గుర్తించారన్నారు. ఆ హుండీలలోని నగదునంతా దోచుకెళ్లారు. చిల్లర నాణేలను మాత్రం అక్కడే వదిలేశారు. వాటిలో ఒక్క రూపాయి, రెండు రూపాయి, ఐదు రూపాయల నాణేలు ఉన్నాయి.

అయితే తెలిసిన వ్యక్తులే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు అనుకుంటున్నారు. ముగ్గురు అంతకంటే ఎక్కువ వ్యక్తులు పాల్గొని ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిద్రలో ఉన్న అర్చకులను నిద్రలోనే గొంతు కోసి చంపేసినట్లు భావిస్తున్నారు. ఎక్కడ పడుకున్న వారు అక్కడే రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉన్నారు. అర్చకులను హత్య చేసిన అనంతరం దుండగులు ఆలయం మొత్తాన్ని జల్లెడ పట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. గర్భగుడిలో విలువైన వస్తువులను కూడా అపహరించడానికి ప్రయత్నం చేసినట్లు ఆనవాళ్లను గుర్తించారు.

సమాచారం అందుకున్న దేవాదాయ శాఖ అధికారి విపుల్ కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆధారాలు సేకరించారు. డాగ్ స్క్వాడ్ టీమ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని.. ఈ ఘటన వెనుక ఎంతటి వారున్నా పట్టుకొని కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: