ఊహించని ఘటన.. గాలిపటం ప్రాణం తీసింది..?

praveen
మృత్యువు ఎప్పుడూ ఎటు  నుంచి వచ్చి కబలిస్తుందో అన్నది ఊహించని విధంగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు సంతోషాన్ని ఇస్తుంది అనుకున్నదే ప్రాణాలు తీసుకుంటుంది. ముఖ్యంగా గాలిపటాల విషయం లో ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది. ఎంతో సంతోషంగా గాలిపటం ఎగుర వేయడానికి ప్రయత్నిస్తూ వుంటారు చాలామంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రమే ఆహ్లాదాన్ని పంచే గాలిపటమే ... కానరాని లోకాల కు పంపిస్తుంది అనేది  ఎవరూ ఊహించరు. ఇలాంటి ఘటనే జరిగింది ఇక్కడ. గాలిపటం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కరెంటు వైర్ల మధ్యలో చుక్కుకున్న గాలిపటం   తీసుకుపోయిన 12 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు




 విషాదకర  హైదరాబాద్లోని నేరేడ్మెట్ పరిధి లో చోటు చేసుకుంది. సాయి నగర్ లో ని  కుమార్ అనే వ్యక్తి కుటుంబ నివాసం ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మధ్యాహ్న సమయం లో... ఎదురింటి భవనం పై ఎక్కి గాలిపటాన్ని ఎగరేచూస్తున్నాడు 12 ఏళ్ల కుమారుడు కీర్తన్. అయితే కొడుకు ఆడుకుంటున్నాడు కదా అని తల్లి దండ్రులు కూడా అంతగా పట్టించు కోలేదు. కానీ ఈ విషాదకర ఘటన జరుగుతుందని మాత్రం తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. ఆ  సమయంలో విద్యుత్ తీగల మధ్యలో గాలిపటం చిక్కుకుపోయింది. అక్కడ ఉన్న ప్రమాదాన్ని ఊహించలేకపోయాడు  సదరు బాలుడు.. గాలిపటాన్ని అందుకునే ప్రయత్నం లో విద్యుత్ తీగలకు తగిలాడు. దీంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.



 గమనించిన స్థానికులు వెంటనే బాలున్ని  ఆసుపత్రికి తరలించినప్పటికే ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. సదరు బాలున్ని  పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధరించారు. అప్పుడు వరకు కళ్లెదుటే ఆడుకున్న కన్నబిడ్డ ఇకలేడు అన్న విషయాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. విగతజీవిగా పడి ఉన్న బాలుడి మృతదేహంతో పై పడి కన్నీరుమున్నీరుగా విలపించారు. తల్లిదండ్రుల ఆవేదన చుట్టుపక్కల వారిని సైతం కంటతడి పెట్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: