జగన్ ఢిల్లీ టూర్ ? కారణాలు ఇవే ?
ఈ వ్యవహారాన్ని తేల్చాల్సిందిగా జగన్ సిబిఐకి లేఖ రాయడంతో, ఒక్కసారిగా బీజేపీ-జనసేన సైలెంట్ అయిపోవడమే కాకుండా, తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ నిర్ణయాన్ని ప్రశంసించాల్సి వచ్చింది. ఈ రెండు పార్టీల మధ్య ఈ వ్యవహారం ఈ విధంగా ఉండగా, తాజాగా ఏపీ సీఎం జగన్ మరికొద్ది రోజుల్లోనే ఢిల్లీకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఈ టూర్ లో కేంద్ర మంత్రులను కలిసి అనేక సమస్యల గురించి ప్రస్తావించబోతున్నట్టు సమాచారం.
అలాగే ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తో పాటు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, అలాగే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తో కూడా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలతో పాటు, నిధులకు సంబంధించిన విషయాలపైన జగన్ చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదీ కాకుండా ప్రస్తుతం ఏపీలో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.
అదీ కాకుండా ఏపీకి సంబందించిన కొన్ని విషయాల్లో కేంద్రం సహకారం కూడా అవసరం కావడం, అలాగే మరికొన్ని విషయాల్లో వైసీపీ సహకారం కేంద్రానికి అవసరం అవ్వడం ఇలా అనేక అంశాలకు సంబందించిన విషయాలతో పాటు ఏపీలో బీజేపీ, వైసీపీ ల మధ్య ఏర్పడిన గ్యాప్ కు సంబందించిన విషయాలపైనా సుదీర్ఘంగా చర్చించబోతున్నట్టుగా వైసీపీ లో వినిపిస్తున్న గుసగుసలు.