బాబు కోసం అచ్చెన్నా ఇంత పెద్ద రిస్క్ చేస్తున్నాడా..?

P.Nishanth Kumar
రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం ఇప్పట్లో సమసి పోయేలా లేదు.. ప్రతిపక్షాలు ఎందుకు దీన్ని ఇంతలా వ్యతిరేకిస్తున్నాయో వైసీపీ కి అర్థం కావట్లేదని ఆయా వర్గాలు ఆవేశాన్ని కలుగజేస్తున్నాయి.. స్వంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలని వాడుకుంటూ వారి ప్రాంత అభివృద్ధిని చేజేతులా దూరం చేస్తున్నారు.. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మాత్రం ఇంకా ఈ అంశాన్ని వదిలిపెట్టకపోగా జగన్ పై రోజు రోజు కి పెరిగిపోతున్న అభిమానాన్ని తట్టుకోలేక దుమ్మెత్తి పొసే ప్రయత్నం చేస్తుంది.  ఇక ఈ ప్రాంతపు టీడీపీ లీడర్లు తప్ప ఇతర ప్రాంత టీడీపీ లీడర్లు ఎవరు మూడు రాజధానుల విషయం పై స్పందించట్లేదు..

రాయలసీమ, ఉత్తరాంధ్ర లోని టీడీపీ నేతలు నామమాత్రంగానే ఉన్నట్లు కనిపిస్తుంది.. పార్టీ లోని ఏ కార్యకలాపానికి వారు పెద్దగా హాజరు కావట్లేదని తెలుస్తుంది.. చంద్రబాబు దీనిపై పలుమార్లు హెచ్చరించిన వారి చెవిన ఇది పట్టకపోవడం టీడీపీ ని కలవరపరుస్తోంది.. అయితే వీరందరికి భిన్నంగా శ్రీకాకుళం జిల్లా కి చెందిన కింజారపు ఫ్యామిలీ వ్యవహరించడం ఆయన అభిమానులను కలవరపరుస్తోంది. ఒకరకంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ ఫామిలీ రిస్క్ చేస్తుందని అంటున్నారు..  పార్టీ ఐదైనా.. తమ ప్రాంత ప్రజల ప్రయోజనాల కోసం పని చేసే వారినే ప్రజలు ఆదరిస్తారన్న విషయం అందరికీ తెలిసిందే.

అయితే వీరు తమ ప్రాంతం కోసం కాకుండా చంద్రబాబు మెప్పు కోసం అమరావతి పై పోరాటం చేయడం ఇప్పుడు ఆ ప్రాంత వాసులకు నచ్చడం లేదట.. విశాఖ కార్యనిర్వాహక రాజధాని అయితే.. ఉత్తరాంధ్ర ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు విరివిగా లభిస్తాయనడంలో సందేహంలేదు. నెట్‌వర్క్‌ కంపెనీల కేబుల్‌ కోసం గోతులు తీసేందుకు, సిమెంట్‌ పనులకు శ్రీకాకుళం జిల్లా ప్రజలు హైదరాబాద్, చెన్నై సహా ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు.  అయితే ఇక్కడ రాజధాని వద్దని చెప్పి ఇక్కడి ప్రజల వ్యతిరేకత తో పాటు జగన్ ఆగ్రహాన్ని మూటకట్టుకుంటూ తమ రాజకీయ భవిష్యత్ ని ఇబ్బందుల్లో పెట్టుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: