భార్యపై అనుమానం... అత్త చంపిన అల్లుడు..?

praveen
భార్యాభర్తల మధ్య బంధం బలపడాలంటే ఒకరిపై ఒకరికి ఎంతో నమ్మకం ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎంతో సాఫీగా సాగిపోతున్న భార్య భర్తల బంధం మధ్యకి  అనుమానం అనే  పెనుభూతం వచ్చిందంటే  దారుణ పరిస్థితులు జరిగిపోతూవుంటాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. తన భార్య మరొకరితో అక్రమ సంబంధానికి తెరలేపింది అన్న  అనుమానం పెంచుకున్న భర్త... ఉన్మాది గా మారిపోయి దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా అమానుషంగా భార్య గొంతుకోసి హత్య చేశాడు. అంతటితో ఆగకుండా భార్యకు సహకరిస్తుంది అన్న అనుమానంతో అత్త ను  సైతం చంపేశాడు. ఈ దారుణ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

 రాజస్థాన్ లోని  జైపూర్ లో  చోటు చేసుకుంది ఈ దారుణ ఘటన. వివరాల్లోకి వెళితే... శివం కాలనీకి చెందిన మంజు సైని తో రామకిషన్ సైని  వివాహం జరిగింది. వారికి ప్రస్తుతం ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక ఇల్లరికం వచ్చిన రామ్ కిషన్ సైని అత్తారింట్లో లోనే ఉండేవాడు. అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో భర్తకు భార్యపై అనుమానం వచ్చింది. భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానపడేవాడు . అంతేకాకుండా భార్య అక్రమ సంబంధానికి అత్త కూడా సహకరిస్తుంది అని అనుకున్నాడు. రోజురోజుకీ అతని మనసులో అనుమానం పెనుభూతం గా మారిపోయింది.


 దీంతో కఠిన నిర్ణయం తీసుకున్నాడు భార్యను హత్య చేయాలని అనుకున్నాడు. ఇంట్లో అందరు నిద్రిస్తున్న సమయంలో మొదట భార్య గొంతు కోసి దారుణంగా చంపేసిన అల్లుడు అనంతరం అత్త గొంతు కోసి చంపేశాడు. ఇక తర్వాత తన పిల్లలను తీసుకుని పోలీస్ స్టేషన్  వెళ్ళి పోయాడు. జరిగిన విషయం మొత్తం పోలీసుల ముందు వివరించాడు నిందితుడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇంటికి వెళ్లి చూసేసరికి రక్తపు మడుగులో తల్లి కూతుర్లు  పడి ఉన్నారు  ఇక మృతదేహాలను పోస్టుమార్టంకి  తరలించిన పోలీసులు... నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: