అంతర్వేది ఘటన పై టీడీపీ నిరసన ఉద్రిక్తం..
ఇప్పుడు శ్రీకాహస్తిలో మరొక లింగాన్ని ప్రతిష్టించి అపచారం చేశారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనల పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారు. కానీ, ప్రతి పక్షాల నిరసన మాత్రం ఆగట్లేదు. తాజాగా.. అనంతపురం జిల్లా మడకశిర పట్టణం లో అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి రథం తగులబెట్టిన దుండగులను వెంటనే శిక్షించాలంటూ టీడీపీ నేతలు నిరసనకు దిగారు. నగరంలోని మెట్టు బండ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద పూజలు నిర్వహించి ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న సారధ్యం లో నిరసనను ఉద్రిక్తంగా మార్చారు.
తిప్పేస్వామి మాట్లాడుతూ.. రథం దగ్దం చేసిన దోషులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరారు. హిందువులను, దేవాలయాలను, వాటి ధర్మాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇక ఈరన్న మాట్లాడుతూ.. ఈ ఘటన పై పూర్తి బాధ్యతను ప్రభుత్వం వహించాలని కోరారు.అలాగే రాష్ట్రంలో నందమూరి పరిటాల విగ్రహం ధ్వంసం కారకులైన వారిని శిక్షించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ మధ్య రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని వారికి రక్షణ కల్పించాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే దిశగా ప్రభుత్వం సాగాలని సూచించారు..