ఆదర్శ భార్య.. దొంగతనంలోనూ చేయి వదలలేదు.. కానీ చివరికి..?
కానీ ఇక్కడ దంపతులిద్దరూ ఇదే చేశారు. తాళం వేసిన ఇళ్లు టార్గెట్ చేసి రెక్కీ నిర్వహించి ప్లాన్ ప్రకారం అందినకాడికి దోచుకుపోతున్నారు. కానీ చివరికి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు ఈ భార్య భర్తలు. గుంటూరు జిల్లా నరసరావుపేట లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. శివ సంజీవయ్య కాలనీకి చెందిన కత్తి రవి కుమార్.. గీతాంజలి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయితే రవికుమార్ కు చిన్నప్పటి నుంచి నేర చరిత్ర ఉంది. పలుమార్లు పోలీస్ స్టేషన్ కు కూడా వెళ్లి వచ్చాడు.
ఇక 2019 జైలు నుంచి విడుదలైన రవి కుమార్ భార్య తో కలిసి టీ కొట్టు పెట్టుకుని జీవిస్తున్నాడు. అయితే అందరూ నేరాలను మరిచి బాగా జీవిస్తున్నారు అని అనుకున్నారు. కానీ వారి లోపలి బుద్ధి మాత్రం అర్థం చేసుకోలేకపోయారు. దంపతులిద్దరూ ద్విచక్రవాహనంపై తిరుగుతూ తాళం వేసిన ఇళ్ళనే టార్గెట్ చేసుకునేవారు. భార్య బయట ఎవరూ రాకుండా నిఘా పెడితే భర్త ఇంటి లోకి వెళ్లి అందినకాడికి దోచుకునేవాడు. ఇలా దొంగతనాలకు పాల్పడుతూ పలు ప్రాంతాలలో మకాం మారుస్తూ వచ్చారు. ఇంకేముంది బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. పోలీసులకు సవాల్ గా మారిన ఈ దొంగతనాల కేసులు ఎంతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు... ఈ ఇద్దరు దొంగలను అరెస్టు చేశారు.