వైద్యులకు శుభవార్త : వైరస్ ను అంతం చేసే మాస్క్ వచ్చేసింది..?
ఈ క్రమంలోనే వైరస్ ను అంతం చేసే మాస్కులను కనుగొనేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా బ్రిటన్ లోని భారత సంతతి వైద్య నిపుణుడు కరోనా నుంచి రక్షణ కల్పించే మాస్క్ లను రూపొందించారు. అంతేకాదు ఆసుపత్రిలో వాటిని ఉచితంగా అందించడం గమనార్హం. రాయల్ స్టోక్ యూనివర్సిటీ ఆసుపత్రిలో సర్జరీ గా పనిచేస్తున్న అజిత్ జార్జ్... కరోనా వైరస్ నుంచి రక్షణ కల్పించే మాస్కులనూ అందుబాటులోకి తీసుకొచ్చారు.
చికిత్స చేసే సమయంలో ముక్కు చెవి గొంతు ద్వారా... ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముందని... కరోనా రోగులు దగ్గినప్పుడు... వైద్యులకు వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని.. అందుకే స్నాప్ అనే ఈ మాస్కును రూపొందించినట్లు సదరు వైద్య నిపుణుడు తెలిపాడు. ఈ మాస్కుకి కింది భాగంలో పై భాగంలో రెండు వాల్వులు ఉంటాయని తెలిపిన ఆయన... కరోనా రోగుల ముక్కులో జొప్పించిన వైద్య పరికరాలను తీసివేసిన తర్వాత.. ఈ రెండు వాల్వులు మూసుకుపోతాయి అంటూ తెలిపారు. కాగా కరోనా రోగుల దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే వైరస్ ను ఈ మాస్క్ హరించేస్తుంది అంటూ తెలిపిన ఆయన... వైరస్ వ్యాప్తిని ఇది ఎంతగానో అడ్డుకుంటుంది అంటూ తెలిపారు.