టమాటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా.. తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు..?

praveen
మామూలుగా మనం రోజూ వండే  వంటకాలలో టమాటా ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి వంటకంలో  కూడా టమాటా వాడటం సర్వసాధారణం. అయితే టమాటా వేస్తే గాని ఏ వంటకానికి అయినా సరైన రుచి రాదు అని అంటూ ఉంటారు. అయితే కేవలం రుచి  కోసం మాత్రమే టమాటా వంటకాలలో వేస్తారు అనుకుంటే మాత్రం పొరబాటే... ఎందుకంటే టమాటాలో  సి విటమిన్ తో పాటు ఏ విటమిన్ ఉండడం పొటాషియమ్ ఫైబర్ లాంటి ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉండడంతో.. టమాటాను వంటకాలలో  ఎక్కువగా వాడుతూ ఉంటారు.




 అంతేకాదు వివిధ రకాల రోగులకు కూడా టమాటాలు ఎంతో బాగా పని చేస్తూ ఉంటాయి . కాగా  టమాటాలు తరచూ ఎక్కువగా తినడం కారణంగా కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది అని చెబుతూ ఉంటారు. అయితే ఇన్ని రకాల ప్రోటీన్స్ ఇచ్చే టమాటాను తినడం వల్ల కిడ్నీలో రాళ్లు రావడం అనే వాదన ఎంత వరకు నిజం అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. టమాటాల ద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది నిజమే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. టమాటా లలో ఆక్సలేట్ ఎక్కువగా ఉండటం కారణంగా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు అవి సహకరిస్తాయట.




 అయితే మిగతా కూరగాయల్లో కూడా ఈ ఆక్సలేట్ ఉంటుంది కానీ టమాటాల్లో  ఈ ఆక్సలేట్  శాతం కాస్త ఎక్కువగా ఉంటుందట. కాగా  సాధారణంగా టమోటాలను తింటే ఎలాంటి సమస్యలు రావు గాని.. అతిగా  తింటే  మాత్రం కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా కిడ్నీ లో రాళ్ళు మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు టమాటాలు దూరంగా ఉండడమే మంచిది అని చెబుతున్నారు. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నట్లయితే రోజుకు రెండు లీటర్ల నీళ్లు తాగాలని... తద్వారా క్రమక్రమంగా కాస్త ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: