కార్డు అవసరం లేదు.. వాచ్ తో పేమెంట్లు..?

praveen
మామూలుగా ప్రస్తుతం మనం ఎక్కడైనా పేమెంట్ చేయాలి అంటే డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్ చేస్తూ ఉంటాము. లేదా ఆన్లైన్ పేమెంట్ యాప్ ద్వారా పేమెంట్ చేస్తూ ఉంటాం. కానీ ప్రస్తుతం ఇవన్నీ లేకుండానే కేవలం వాచ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు అంటే నమ్ముతారా... వాచ్ ద్వారా పేమెంట్ చేయడం ఏంటి అని అంటారా... ప్రముఖ వాచ్ తయారీ కంపెనీ టైటాన్ ఇలాంటి సరికొత్తగా వాచ్ లను  ప్రస్తుతం తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. టైటాన్ కాంటాక్ట్ లెస్  పేమెంట్ కోసం ఐదు కొత్త వాచ్ లను  మార్కెట్లోకి విడుదల చేసింది కంపెనీ. అధునాతన టెక్నాలజీతో తయారు చేయబడిన ఈ వాచ్ ల ద్వారా... డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే... పేమెంట్ చేసే అవకాశం ఉంటుంది.



 ఈ వాచ్ లో ఉండే టైటాన్ పేమెంట్ ఫీచర్ ద్వారా ఆన్లైన్ నగదు చెల్లింపు చేయవచ్చు. ప్రస్తుతం కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉండటం గమనార్హం. దీనికోసం స్టేట్ బ్యాంకు తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది టైటాన్. ఎలాంటి పిన్  అవసరం లేకుండా రెండు వేల వరకు నగదు  చెల్లించే అవకాశం కల్పించింది. అయితే రెండు వేలకు మించి నగదు చెల్లించాలి అంటే మాత్రం తప్పనిసరిగా పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.




 యోనో ఎస్బిఐ సాయంతో దుకాణాలు, పిఓఎస్ మెషిన్లు అందుబాటులో ఉన్న ప్రతి చోట కూడా కూడా ఈ టైటాన్ పేమెంట్  పనిచేస్తుంది అంటూ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అయితే టైటాన్ వాచ్ లో ఈ సరికొత్త ఫీచర్ను యాక్టివేట్ చేసుకోవడానికి ఎస్బిఐ ఖాతాదారులు అందరూ కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది కంపెనీ  ప్రతినిధులు తెలిపారు. కాగా ప్రస్తుతం ఈ సరికొత్త టెక్నాలజీతో కూడిన 5 మోడల్స్ వాచ్ లను టైటాన్ మార్కెట్లో ఉంచగా.. ఇందులో మూడు పురుషుల కోసం రెండు స్త్రీల కోసం డిజైన్ చేసినట్లు తెలిపారు కంపెనీ ప్రతినిధులు. వీటి ద్వారా వరుసగా..రూ. 2,995, రూ.3,995, రూ.5,995గాను.. స్త్రీల వాచ్‌ ధరలు రూ.3,895, రూ.4,395గా నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: