ప్రియుడి ఇంటికి వెళ్ళిన కూతురు... తండ్రి చేసిన పనికి అందరూ షాక్..?
ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ దేహత్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... కన్పన్న గ్రామానికి చెందిన యువతి... గ్రామంలో కిరాణా షాప్ నడుపుతున్న ఓ యువకుడిని ప్రేమించింది. అర్ధరాత్రి సమయంలో ప్రియుడి ఇంటికి వెళ్ళింది యువతి. ఇక అక్కడే ఉంటాను అంటూ ఇంట్లో వాళ్లకి చెప్పేసింది. అయితే తమ కూతురిని తన ఇంటికి తెచ్చుకోవడానికి కుటుంబ సభ్యులు ప్రియుడు ఇంటికి వెళ్లారు. తిరిగి రావాలని కూతుర్ని అడిగినప్పటికీ ససేమిరా అంది. అంతటితో ఆగకుండా ప్రియుడికి సపోర్ట్ చేస్తూ తండ్రి తో వాగ్వాదానికి దిగింది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడై అయ్యాడు ఆ తండ్రి.
కన్న కూతురు అని కూడా చూడకుండా ఏకంగా గొడ్డలితో విచక్షణారహితంగా నరికాడు. ప్రియుడి ఇంటి ముందు దారుణంగా హత్య చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక అడ్డుకోవడానికి మధ్యలో వచ్చిన ప్రియుడిపై కూడా గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ప్రియుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.