దుర్గమ్మ రథం సింహాల చోరీ వ్యవహారంలో మరో సంచలన విషయం వెలుగులోకి ?

మొన్న అంతర్వేది సంఘటన మరిచిపోకముందే, విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి చెందిన వెండి రథానికి ఉండే మూడు సింహాలు మాయమైన ఘటన కలకలం రేపింది. ఇప్పటికే జగన్ హిందూ వ్యతిరేక శక్తిగా మారారని బిజెపి, జనసేన, టిడిపిలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న క్రమంలో, ఈ వ్యవహారం బయటపడటం సంచలనంగా మారింది. ప్రధానంగా రథానికి ఉండే మూడు వెండి సింహాలు మాయమవడంపై అధికార ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై విజయవాడ కనక దుర్గమ్మ అమ్మవారి ఆలయ చైర్మన్ స్వామి నాయుడు స్పందించారు.

ఈ రథాన్ని తెలుగుదేశం పార్టీ హయాంలోనే చివరిసారిగా ఉపయోగించారని, అప్పటి నుంచి దీనికి మూసుగు కప్పే ఉందని అన్నారు. సింహాల బొమ్మలు తెలుగుదేశం పార్టీ హయాంలోనే చోరీకి గురై ఉండవచ్చని, తెలుగుదేశం పార్టీ హయాంలో ఘాట్ రోడ్ లో ఉన్న దాన్ని తీసుకువచ్చి వేరే  చోటికి మార్చమని ఆయన పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దానిని ఉపయోగించ లేదని, ఇటీవల తనిఖీలు నిర్వహించినపుడు ఆ సింహాల బొమ్మలు రధానికి లేకపోవడం గుర్తించామన్నారు. అసలు ఈ వ్యవహారం అంతా చూస్తుంటే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఇంట్లోనే ఈ బొమ్మలు ఉండి ఉండవచ్చనే అనుమానాన్ని స్వామి నాయుడు వ్యక్తం చేశారు.


 గతంలోనూ నారా లోకేష్ కోసం నారా భువనేశ్వరి అప్పటి ఈవో తో మాట్లాడి అర్ధరాత్రివేళ క్షుద్ర పూజలు చేయించారని స్వామి నాయుడు ఆరోపించారు. నారా లోకేష్ సీఎంను చేసేందుకు ఆయనకు అదనపు శక్తుల కోసం అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేశారని, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం లోనే ఆరోపణలు వచ్చాయి. ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి అమ్మవారి ఆలయం లోకి వెళ్ళినట్టుగా సి సి ఫుటేజ్ కూడా బయటకు వచ్చిందని, విచారణలో ముగ్గురు ఆలయంలో భైరవి పూజలు నిర్వహించినట్లు అంగీకరించారని, కానీ ఆ తరువాత ఆ వ్యవహారం సద్దుమణిగింది పోయిందని, అయితే ఇదంతా టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న దగ్గరుండి చేయించారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.


 ఇప్పుడు ఈ సింహాలు మాయమైన ఘటనకు సంబంధించి ప్రభుత్వం విచారణ చేయించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. పనిలోపనిగా క్షుద్ర పూజల అంశం కూడా ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: