ఇంటి నుండే పని చేస్తున్నారా.. ఇది మీకోసమే..?
కనీసం అరగంటకు ఒకసారి లేచి నిలబడితే రక్తప్రసరణ సక్రమంగా సక్రమంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తద్వారా తొందరగా అలసిపోకుండా ఉంటారట.
అంతేకాదు గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల కాళ్లు కూడా పట్టే అవకాశం ఉందని తద్వారా ఒత్తిడి పెరిగి ఓపిక కూడా నశించిపోతుందని చెబుతున్నారు నిపుణులు. మధ్యలో చిన్నపాటి వ్యాయామం లాంటిది చేయడం లాంటివి చేస్తే కాస్త ఉపశమనం కలిగే... సరికొత్త ఉత్సాహం వస్తుందని చెబుతున్నారు.
ఇంటి దగ్గర గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల ఎంతోమంది నడుము పట్టేసి ఆస్కారం కూడా ఉంటుంది. తద్వారా నడుము నొప్పి వేధిస్తూ పనిచేయడం కష్టంగా మారుతుంది. అందుకే పని చేసేటప్పుడు గోడకు దగ్గరగా కుర్చీ వేసుకుని దానికి కొంత నడుము వంచి సేదతీరుతున్నట్లు కూర్చుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గంటలకొద్దీ కూర్చుని కంప్యూటర్ చూడడం వల్ల కూడా ఎంతో మందికి మెడనొప్పి వచ్చే అవకాశం ఉందని...తద్వారా వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే గంటకు ఒకసారి బోర్లా పడుకుని రెండు చేతులను నేలకు ఆనించి కిందికి పైకి లేవాలి. తద్వారా... మెడ భాగంలో రక్త ప్రసరణ సజావుగా జరుగుతుందట.