అక్రమ మద్యం పట్టుకున్న పోలీసులు.. కానీ ఎస్ఐ పై కేసు నమోదు అయింది..?
అక్రమ మద్యం స్వాధీనం చేసుకుంటే ఎస్ఐ పైన కేసు నమోదు అవ్వటం ఏంటి అని ఆశ్చర్య పోయారు కదా.. అదంతా తెలియాలంటే వివరాల్లోకి వెళ్ళాల్సిందే మరి. తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది ఈ ఘటన. జంగారెడ్డిగూడెం టౌన్ ఎస్సై గంగాధర్ పై కేసు నమోదు అయ్యింది. ఇటీవలే అక్రమంగా రాష్ట్రంలోకి తరలిస్తున్న మద్యాన్ని సీజ్ చేశారు అధికారులు. సీజ్ చేసిన మద్యంలో అవకతవకలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు అని అందుకే... జంగారెడ్డిగూడెం టౌన్ ఎస్సై గంగాధర్ పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇప్పుడు వరకు అక్రమ మద్యం పట్టుకున్న నేపథ్యంలో ఏకంగా 24 బాటిల్స్ మిస్ అయినట్లు అధికారులు గుర్తించారు. అయితే స్వాధీనం చేసుకున్న మద్యం బాటిల్ స్థానంలోనే వేరే మద్యం బాటిల్స్ ఉంచినట్లు అధికారులు విచారణ తేల్చారు... అంతేకాకుండా ఈ కేసుకు సంబంధం లేని మరో అయిదు మద్యం బాటిళ్లను కూడా వాటిలో పెట్టినట్టు గుర్తించారు అధికారులు. ఇక స్థానిక ఎస్సై గంగాధర్ ని వీటన్నింటికీ బాధ్యుడిని చేస్తూ ఏకం గా అతనిపై కేసు నమోదు చేశారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.