హైదరాబాద్ వాసులకు ఇది అదిరిపోయే గుడ్ న్యూస్..?
ఇప్పుడు అలాంటి వారికి ఇది నిజంగా శుభవార్తే. అవును లాక్‌డౌన్ నేపథ్యంలో నిలిచిపోయిన సిటీ బస్సులు త్వరలో మళ్లీ రోడ్డెక్కుతాయట. ఇప్పటికే మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అటు ఆంధ్రాలోనూ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. అందుకే హైదరాబాద్ పరిధిలోనూ సిటీ బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు రెడీ అవుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు లాక్ డౌన్ వాతావరణం లేనేలేదు. అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఆర్టీసీ సర్వీసులు కూడా జిల్లాల్లో నడుస్తూనే ఉన్నాయి.
ఇక అలాంటప్పుడు ఆర్టీసీ సిటీ బస్సులను ఆపడంలో ఔచిత్యం లేదన్న వాదన ఉంది. ఆర్టీసీ అధికారులు కూడా ఇదే భావిస్తున్నారు. అందుకే ఈనెలలోనే సిటీ బస్సు సర్వీసులు ప్రారంభించాలన్న నిర్ణయానికి ఆర్టీసీ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సిద్ధంగా ఉండాలని డిపో మేనేజర్లకు నోటిమాటగా ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే సిటీ బస్సులు నడిచినా పలు ఆంక్షలు మాత్రం తప్పనిసరిగా విధించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే దేశంలోని ఇతర నగరాల్లో బస్ సర్వీసులు నడుస్తున్నాయి. అక్కడి వారు తీసుకుంటున్న చర్యలను తెలంగాణ ఆర్టీసీ పరిశీలిస్తోంది.
హైదరాబాద్‌లో సిటీ బస్సులు తిరగక దాదాపు 6 నెలలు గడిచిపోయాయి. గతంలో ఎన్నడూ ఇంత కాలం సిటీ బస్సులు డిపోలకు పరిమితం కాలేదు. మే నెల మూడో వారం నుంచి జిల్లాల్లో ఆ తర్వాత జిల్లాల నుంచి హైదరాబాద్‌కు సర్వీసులు ప్రారంభమైనా సిటీ బస్సులు మాత్రం డిపోల్లోనే ఉండిపోయాయి. ఇక మొదటగా హైదరాబాద్‌లో 50 శాతం బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది.