భారత్ కి చెక్.. ఇమ్రాన్ కుట్ర పతాక స్థాయిలో..?
తమ దేశంలో మౌలిక వసతులు ఎలా ఉన్నాయి.. అభివృద్ధి జరుగుతుందా లేదా దేశ ప్రజల పరిస్థితి ఎలా ఉంది అన్నది మాత్రం అక్కడి పాలకులకు అవసరం లేదు... ఎలా భారత్ పైచేయి సాధించగలం అనేది తప్ప ఇంక వేరే ఆలోచనే ఉండదు. భారత్ పై ఆధిపత్యం అనేది పాకిస్తాన్ కు కలగా మారిపోతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం భారత్ పై ఆధిపత్యం సాధించేందుకు ఇమ్రాన్ ఖాన్ ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు అనేది ఇటీవల ఓ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ సరిహద్దులో వివాదాస్పద ప్రాంతంగా ఉన్న గిల్గిట్ బల్జిస్తాన్ ను తమ దేశంలో భూభాగం కింద ప్రకటించేందుకు పాకిస్థాన్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం గిల్గిట్ బల్జీస్థాన్ ప్రాంతాన్ని పాకిస్తాన్ లోని ప్రావిన్స్ కింద ప్రకటించేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ముందుకు కదులుతున్నట్టు తెలుస్తోంది. 1947 నుంచి భారత్ పాకిస్తాన్ సరిహద్దు మధ్య సదరు ప్రాంతం వివాదాస్పద ప్రాంతం గానే ఉంది. ఈ ప్రాంతం తమ దేశానికి చెందినది అంటూ ఇరుదేశాలు ఎప్పటికప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటాయి . ప్రస్తుతం పాకిస్తాన్ లోని 5వ ప్రావిన్స్ గా ఈ వివాదాస్పద ప్రాంతాన్ని ప్రకటించాలని పాక్ ప్రభుత్వం సిద్ధమైందట. ఈ విధంగా భారత్ కు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. మరి రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.