ధనికులే ఆమె టార్గెట్.. రాత్రంతా శృంగారం చేసి.. చివరికి..?

praveen
ఈ మధ్యకాలంలో మహిళలను నమ్మించి మోసం చేసి చివరికి బ్లాక్మెయిల్ చేసి దారుణాలకు పాల్పడే వ్యక్తులను మనం చూసే ఉంటాం. ఇలాంటి ఘటనలు చాలానే తెరమీదకు వచ్చాయి. ఇక్కడ  జరిగిన ఘటన మాత్రం చాలా విచిత్రమైనది. ధనికులనే   టార్గెట్గా చేసుకున్న ఓ మహిళ ఏకంగా బరితెగించింది. వారితో పరిచయాలు పెంచుకుని రాత్రంతా శృంగారం లో పాల్గొని  వారికి తెలియకుండా ఆ వీడియోలను రహస్యంగా తీసింది. తర్వాత ఏకంగా వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేసి భారీగా నగదు డిమాండ్ చేసి సొమ్ము చేసుకునేది మహిళ.

 ఈ దారుణ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఇటీవలే పోలీసుల  వరకు దీనికి సంబంధించిన ఫిర్యాదు వెళ్లడంతో సదరు మహిళా గుట్టురట్టయింది. వివరాల్లోకి వెళితే.. శాస్త్రి నగర్ లో ఉండే ఓ వ్యాపారికి ఒక వీడియో వచ్చింది.. అది చూసి ఒక్కసారిగా షాక్. ఎందుకంటే ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన  రహస్యం  మొత్తం ఆ వీడియోలో ఉంది. అంతలో అతనికి ఫోన్ వచ్చింది. 10 లక్షలు ఇవ్వాలని లేకపోతే ఆ  వీడియో సోషల్ ప్రత్యక్షం అవుతుంది అంటూ డిమాండ్ చేసింది. అయితే అతను 10 లక్షలు ఇచ్చికోలేను అంటూ వేడుకున్నప్పటికీ  కనికరించలేదు చివరకు చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించాడు.

 ఇక పోలీసులు పక్కా ప్లాన్ ప్రకారం సదరు వ్యాపారి తో డబ్బులు ఇస్తాను అంటూ మహిళ తో ఒప్పందం కుదుర్చుకునేలా  చేసి... రెడ్ హ్యడెడ్ గా  పట్టుకున్నారు. చివరికి మహిళలను అదుపులోకి తీసుకొని... విచారించగా కేవలం ఈ ఒక్క వ్యక్తి మాత్రమే కాదు ఎంతో మంది ప్రముఖ వ్యక్తులు సైతం ఆ మహిళ ఉచ్చులో చిక్కుకున్నట్లు  గుర్తించారు పోలీసులు. మహిళతో  పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: