సహాయం కోరిన ఐపీఎస్ అధికారి.. కానీ చివరి లో ఊహించని ట్విస్ట్..?

praveen
ఈ మధ్యకాలం లో సైబర్ నేరాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి అనే విషయం తెలిసిందే. సైబర్ క్రైమ్ పోలీసులు నేరాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధిస్తున్నప్పటికీ ఎక్కడ సైబర్ నేరాలు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఏదో ఒక విధంగా ఎప్పుడూ సైబర్ నేరాల కు పాల్పడుతున్నారు. ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను టార్గెట్గా చేసుకుంటున్న సైబర్ నేరగాళ్లు... ఆయా ఖాతాల  పేరుతో ఫేక్ ఖాతాను ఉపయోగించి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఎంతోమందిని టార్గెట్ చేస్తూ ఇలా రోజురోజుకు అక్రమాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ల బెడద పోలీసులకు సరికొత్త తలనొప్పిని తెచ్చిపెడుతోంది.



 ఇటీవలే సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా పేరిట సైబర్ నేరగాళ్లు కొంతమంది ని బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా  పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా ను సృష్టించారు. ఇక తాను  ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను అని కొంత ఆర్థిక సహాయం సర్దుబాటు చేయాలి అంటూ స్నేహితులకు బంధువులకు ఆ ఖాతా  నుంచి మెసేజ్ పంపారు. మళ్లీ రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను అంటూ నమ్మబలికారు. ఇక అనుమానం వచ్చిన కొంతమంది అధికారులు ఈ విషయాన్ని ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా  దృష్టికి తీసుకువచ్చారు.



 దీంతో వెంటనే అప్రమత్తమైన ఆమే  తన అధికారిక ఖాతాలో తాను ఎవరినీ డబ్బులు అడగలేదని... తాను డబ్బులు అడిగాను అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దు అంటూ ఆమె  తెలిపారు. ఇక ఇది గమనించిన సైబర్ నేరగాళ్లు కొన్ని నిమిషాల వ్యవధిలోనే నకిలీ ఖాతా ను తొలగించడం గమనార్హం, ఇక దీంతో వెంటనే అప్రమత్తమైన స్వాతి లక్రా  సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కాగా ప్రస్తుతం నిందితులని పట్టుకునే పనిలో పడ్డారు సైబర్ పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: