ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కానీ నది వద్దకు తీసుకెళ్లి.. దారుణం..?

praveen
నువ్వే నా ప్రాణం నువ్వు లేకుండా బతకలేను అంటూ చెప్పి ప్రేమ పేరుతో వెంటపడ్డాడు... ఆ తర్వాత ఏకంగా పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నాడు... కొన్నాళ్లపాటు భార్యతో  ఎంతో సంతోషంగా ఉన్నాడు... అంతలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో భార్యపై కోపం పెంచుకున్నాడు భర్త. భార్యను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు ఇక పథకం ప్రకారం నమ్మించి నది వద్దకు తీసుకెళ్లి చివరికి నదిలో తోసి ప్రాణం తీసేందుకు ప్రయత్నించాడు.



 వివరాల్లోకి వెళితే... ఆళ్లగడ్డ మండలం మరిపల్లి కి చెందిన భాస్కర్ హైదరాబాద్లోని ఇంటెలిజెన్స్ విభాగం లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడే రామలక్ష్మి అనే అనాథ యువతి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తూ జీవిస్తుంది. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు. పాటు వీరి కాపురం సజావుగానే సాగింది కానీ అంతలోనే వీరి మధ్య కలహాలు మొదలయ్యాయి. ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వదిలించుకోవాలని భర్త భాస్కర్ నిర్ణయించుకున్నాడు.



 ఈ క్రమంలోనే భార్యకు మాయమాటలు చెప్పి స్వగ్రామానికి తీసుకువచ్చాడు. సోమవారం ఉదయం సమయంలో కోవెలకుంట్ల మండలం గుల్లదుర్తి లో ఉన్న బంధువుల వెళ్లి వద్దాము అంటూ భార్యతో చెప్పాడు. ఇక ఈ క్రమంలోనే గ్రామ సమీపంలో ఉన్న నది వంతెన పైకి చేరుకున్న తరువాత బైక్ ఆపాడు  భాస్కర్. ఒకసారి ఈ నదీ ప్రవాహాన్ని  సెల్ఫీ తీసుకుందాం అంటూ భార్యతో నమ్మబలికాడు. చివరికి భార్యను నదిలో తోసేసి ఇది అకస్మాత్తుగా జరిగిన ప్రమాదం గా చిత్రీకరించేందుకు హైడ్రామా మొదలుపెట్టాడు. ద్విచక్ర వాహనంతో నది లోకి దూకాడు. కానీ  కాసేపటికే ఒడ్డుకు చేరుకున్నాడు. స్థానికులు ఇది గమనించి రామలక్ష్మి ని రక్షించారు. దీంతో జరిగిన విషయాన్ని పోలీసుల ముందు చెప్పడంతో భాస్కర్ ను అరెస్టు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: