వీడసలు తండ్రేనా.. కన్నకూతురిపై ఉమ్ముతూ.. చివరికి..?
ఈ ఘటన వికారాబాద్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ ఆర్ టి సి డిపో కండక్టర్ గా పనిచేస్తుంటాడు అజిమొద్దీన్. అతనికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే ఇటీవలే మద్యానికి బానిసగా మారిన అజీమ్... ఫుల్లుగా తాగి వచ్చి భార్య కూతుర్లతో గొడవ పడుతూ వేధింపులకు దిగేవాడు. నీచంగా కన్నకూతురిపైనే ఉమ్మి వేస్తూ దారుణంగా చితకబాదడం లాంటివి చేసేవారు ఆ తండ్రి. ఇక తండ్రి వేధింపులు భరించలేక ఆ చిన్నారులు కాళ్ళ వేళ్ళ పడినప్పటికీ కూడా కనికరించచకపోయే వాడు.
కొన్నిసార్లు చాకుతో పీక కోసి చంపేస్తాను అంటూ బెదిరింపులకు కూడా దిగేవాడు. ఇటీవలే అజీమ్ పిల్లల్ని బెదిరిస్తున్న ఒక వీడియో కాస్త బయటకు రావడంతో ఈ శాడిస్ట్ తండ్రి వ్యవహారం బయటపడింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతన్ని అరెస్టు చేశారు. భార్య పిల్లలను పోలీసులు రక్షణ నిమిత్తం సఖి సెంటర్ కు తరలించారు. ఎన్నో రోజుల నుంచి తన తండ్రి పెడుతున్న చిత్రహింసలను పోలీసుల ముందు వివరించి చిన్నారులు బోరున విలపించారు. ఇక అజీమ్ అసలు నిజస్వరూపం తెలిసి స్థానికులు సైతం ఒక్కసారిగా షాకయ్యారు.