రోజా 'నగరి' లో ఈ రేంజ్ లో వర్క్ అవుట్ చేస్తుందా..?
ఇక మొదటినుంచి పార్టీ లో కీలక పాత్ర పోషించిన రోజా కి ఈ సారి మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ కొన్ని సమీకరణాల దృష్ట్యా ఆమెకు మంత్రి పదవి దక్కలేదు.. రెండవసారి చేసే మంత్రి వర్గ విస్తరణలో అయినా ఆమెకు చోటు దక్కుతుందో చూడాలి.. ఇక ఆమెకు మంత్రి పదవి దక్కకపోవడమే మంచిది అంటున్నారు నగరి వాసులు.. మంత్రి పదవి వస్తే ఆమె తనకున్న రాష్ట్రాభివృద్ధి పనులతో నే సరిపోయేది నగరి లోని ప్రజల బాగోగులు చూసుకునేవారు కాదు.. అంటున్నారు..
ప్రస్తుతం ఆమె నగరి ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ ఏ లోటు రానివ్వట్లేదు.. దాంతో ప్రజలు ఆమెకు నీరాజనాలు పలుకుతున్నారు.. దీంతో అక్కడ టీడీపీ నాయకులూ సైతం రోజా పనితనానికి ముగ్దులవుతున్నారట.. టీడీపీ నుంచి పోటీ చేసిన గాలి వారసుడు కూడా నగరి లో ఎక్కువ గా కనిపించకపోవడం రోజా కు కలిసొచ్చే అంశం.. ఇక ఇటీవలే 41 టీడీపీ సానుభూతిపరులైన కుటుంబాలకు ఆర్కే రోజా పార్టీలోకి తీసుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు, లోకేష్ పట్టించుకోకుంటే నగరిలో టీడీపీ దుకాణం బంద్ అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరిలో సగం టీడీపీ క్యాడర్ పార్టీని వీడి వెళ్లిందంటున్నారు.