ఏపీ ప్రజలకు షాక్.. ఇక ఆర్టీసీ బస్సుల్లో అలా కుదరదు..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రస్తుతం ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ ప్రయాణికులందరికి ఎంతో మేలు జరిగింది అని చెప్పాలి. మొన్నటి వరకు బస్సు సీటింగ్ విధానంలో మార్పులు చేర్పులు చేసింది ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ. ఇక ప్రస్తుతం బస్సులు ప్రారంభమైన నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. మామూలుగా అయితే బస్సులో ఉన్న సీట్లు ఫుల్ అయిపోయినప్పుడు ప్రయాణికులు... కష్టమైన నిలబడి కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కానీ ఇకనుంచీ మాత్రం అలాంటి అవకాశం లేదు అని చెప్పాలి.
ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ నిబంధనల లో భాగంగా బస్సులో నిలబడి ప్రయాణించడానికి ప్రయాణికులకు అనుమతి లేదని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బ్రహ్మానంద రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మొదట సీటుకు ఒకరు చొప్పున కూర్చోవడానికి అనుమతి ఉంటుంది అంటూ తెలిపిన ఆయన... బస్సులో ఉన్న అన్ని సీట్లు నిండిన తర్వాత పక్కన మరొకరు కూర్చోడానికి అనుమతి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య మొన్నటి వరకు కేవలం 50 శాతం సీట్లు సామర్థ్యంతో మాత్రమే బస్సులను తిప్పాలని భావించిన ఏపీఎస్ఆర్టీసీ.. ప్రస్తుతం పూర్తి స్థాయి సీటింగ్ సామర్థ్యంతో బస్సులను నడపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.