పురుగుల మందు తాగి చనిపోయిన 25ఏళ్ల రైతు.. కారణం అదే!

Suma Kallamadi
గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్ కు చెందిన ఒక 25 ఏళ్ల రైతు ఆత్మహత్యకు పాల్పడటంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. సురేంద్ర నగర్ జిల్లా ధేడుకి గ్రామానికి చెందిన 25 ఏళ్ల రైతు మంగళవారం రోజు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే మృతుడి ని చందు ఖామని గా పోలీసులు నిర్ధారించారు. చందు నువ్వుల పంటను పండించాడు కానీ భారీ వర్షాల కారణంగా అతని పంట మట్టి పాలయ్యింది. ఎన్నో నెలల పాటు శ్రమించి పండించిన పంట చేతికి అందకుండా వృధా కావడంతో చందు ఒక్కసారిగా మానసికంగా కృంగి పోయాడు. పంట చేతికి అందితే తనకున్న కష్టాలు తొలగి పోతాయని భావించిన అతనికి వర్షం రూపంలో దురదృష్టం ఎదురైంది.


ఈ నిజాన్ని జీర్ణించుకోలేక చందు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే చందు చనిపోయిన మూడు రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వర్షం కారణంగా పంట నష్టపోవడంతో చందు గత కొన్ని రోజులుగా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. రెండేళ్ల క్రితం భార్య విడిచిపెట్టడం తో ఒంటరిగా నివసిస్తున్న చందు డిప్రెషన్ కి లోనయ్యాడని కూడా కుటుంబ సభ్యులు తెలిపారు. స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గోహిల్ మాట్లాడుతూ.. చందు ఆత్మహత్య చేసుకోవడానికి అసలైన కారణం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.


మూడు రోజుల క్రితం ప్రతాప్ వేగాల్ అనే ఒక యువ రైతు కూడా పురుగుల మందు తాగి మరణించాడు. ఆర్థికంగా నష్టపోవడం వలనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసుల వెల్లడించారు కానీ గ్రామస్తులు మాత్రం పంట నష్టపోవడం కారణంగానే ప్రతాప్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ఆమోదించిన తర్వాత రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. సెప్టెంబర్ 25 వ తేదీన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు చేపడతామని కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రైతు సంఘాలు భారత బంద్ కి కూడా పిలుపునిచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: