చైనా నాటకం తెలిసిపోయింది.. భారత్ వ్యూహం అదిరింది..?

praveen
భారత్ చైనా సరిహద్దు లో తలెత్తిన వివాదం సద్దుమణిగేలా ఉందా  అంటే... చర్చలు జరిగినప్పుడు సద్దుమణిగినట్లు అనిపిస్తుంది... అని చర్చలు ముగియగానే చైనా డబల్ తో మరోసారి సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందుకంటే చర్చలు జరిగినప్పుడు శాంతియుతంగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని చెబుతున్న చైనా చర్చ ముగియగానే మళ్లీ సరిహద్దుల్లో తోక జాడిస్తూ  నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ఉంది. దీంతో భారత్ కూడా దీటుగా సమాధానం ఇస్తుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రోజురోజుకు సరిహద్దుల్లో పరిస్థితులు హాట్ హాట్ గా మారిపోయి యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి తప్ప ఎక్కడా సద్దుమణిగే  సంకేతాలు మాత్రం కనిపించడం లేదు.



 అయితే ఇటీవలే తమ వ్యూహాన్ని మార్చుకున్న భారత్ టిట్  ఫర్ ట్యాట్  అనే తరహాలో చైనా కు సంబంధించిన పర్వతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. దీంతో  బేరసారాలకు దిగిన చైనా చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ చర్చల్లో కీలక ఒప్పందాలు జరిగాయి. ఇరుదేశాలు కొత్తగా సరిహద్దుల్లో ఎలాంటి మొహరింపు జరగకూడదని.. అంతేకాకుండా ఇప్పటివరకు జరిగిన మోహరింపులన్నింటిని  ఉపసంహరించుకోవాలి అంటూ ఒప్పందం చేసుకున్నారు. అయితే  ఓవైపు సరిహద్దుల్లో సైనికులను వెనక్కి పంపాలి అంటూ ఒప్పందం కుదుర్చుకున్న చైనా... ఆక్సాయ్చిన్ ప్రాంతం లో మళ్లీ మొహరింపు జరుపుతూ డబుల్ గేమ్ ఆడుతున్నట్లు భారత్ నిఘా వర్గం గుర్తించింది.



 దీంతో చైనా అసలు నాటకం కాస్త బయట పడిపోయింది.  మోహరింపు ఆపేసాము  అని చెబుతూనే ఆక్సాయ్చిన్ దగ్గర భారీగా మోహరింపులు  జరుగుతుందట చైనా. అంతేకాదు  ఎక్కడ ఉపసంహరణలు కూడా చేయటం లేదు. ఈ నేపథ్యంలో భారత్ కూడా చైనా కు షాక్ ఇచ్చింది. ఏకంగా 12 వేల మంది సైనికులను కొత్తగా మోహరించడం తో పాటు.. యుద్ధ విమానాలను కూడా సరిహద్దుల్లో మోహరించింది భారత్. ఇక ఒప్పందంతో భారత్ వెనక్కి వెళ్తుంది అనుకున్న చైనా కు   భారత్ కొత్త మోహరింపులతో  ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో స్థితిలో పడిపోయింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: