నాని రెస్ట్ తీసుకుంటారా?
ఇలా ఎప్పుడు నాని వర్సెస్ టీడీపీ నేతలుగా సాగే యుద్ధం ఇప్పుడు నాని వర్సెస్ బీజేపీ నేతలు అన్నట్లు మారిపోయింది. కొడాలి హిందూ దేవాలయాలపై సంచలన వ్యాఖ్యలు చేయడమే, బీజేపీ నేతలు రివర్స్‌లో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. నాని వ్యాఖ్యలని ఖండిస్తూ, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇక ఇలా బీజేపీ నేతలు మరింతగా విమర్శలు చేస్తుంటే కొడాలి నాని మరోసారి మీడియా ముందుకొచ్చి, ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో బీజేపీ నేతలకు చిర్రెత్తుకొచ్చింది. అందుకే నానీని ఇష్టారాజ్యంగా తిట్టేస్తున్నారు. నానీని కేబినెట్ నుంచి తొలగించాలని జగన్‌ని ఒత్తిడి చేస్తున్నారు. నాని దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. అయితే నాని వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సైతం స్పందిస్తూ, ప్రధానిపై అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని చెప్పేశారు.
అంటే నాని వ్యాఖ్యలతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లు సజ్జల మాట్లాడారు. అయితే ఇది పరోక్షంగా నానీ మరోసారి విమర్శలు చేయకుండా సైలెంట్‌గా ఉంటారని సజ్జల చెప్పినట్లు ఉందని విశ్లేషుకులు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి కొన్నిరోజులు మంత్రి కొడాలి నాని మీడియా ముందుకు రాకుండా రెస్ట్ తీసుకుంటారేమో.