దారుణం : భార్యతో పాటు మరదలు, అత్తని చంపి.. శవాలపై పై అత్యాచారం..?
అంతటితో ఆగకుండా పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. భార్య మరదలు శవాల పై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ అమానుష ఘటన హర్యానా రాష్ట్రం లో వెలుగు లోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సోనిపట్ జిల్లా పట్టికల్యాణ గ్రామానికి చెందిన నూర్ హాసన్ కుటుంబం తో నివసిస్తున్నాడు. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే గత కొంతకాలం గా భార్యకు వేరొకరి తో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న భర్త... దానికి కుటుంబ సభ్యులు కూడా సహకరిస్తున్నారు అని ఎంతగానో రగిలిపోయాడు.
దీంతో ఉన్మాదిగా మారి పోయి ఏకంగా కట్టుకున్న భార్యతో పాటు ఆమె చెల్లెలిని కూడా దారుణంగా విచక్షణ రహితం గా దాడి చేసి చంపేశాడు. అనంతరం ఇద్దరి శవాలు పై అత్యాచారం చేశాడు. అనంతరం సమీపం లో ఉంటున్న అత్త ఇంటికి వెళ్లి అత్తను కూడా దారుణం గా హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాలను వేరు వేరు చోట్ల పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఈ సంచలన నిజాలు బయటపడ్డాయి. దీంతో నిందితున్ని అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.