దూసుకొచ్చిన చైనా.. భారత్ ఎదురుదాడిలో ఆరుగురు చైనా సైనికులు హతం..?
ఇటీవలి కాలంలో చైనాతో సరిహద్దుల్లో భారత్ సైన్యం చాలా అప్రమత్తంగా ఉంటోంది. చైనా ఏమాత్రం తోకజాడించినా ఘాటుగానే బుద్ది చెబుతోంది. అంతే కాదు.. కొంతకాలంగా చైనా ఆధీనంలో ఉన్న మన సొంత భూభాగాలను కూడా ఇటీవల ఇండియా స్వాధీనం చేసుకుంది. దీంతో ఇటీవల ఈ ప్రాంతాలపై భారత్ పట్టుబిగుస్తుందన్న ఆందోళనలో ఉన్న చైనా.. భారత్ సైన్యంతో దుందుకుతనంతో వ్యవహరిస్తున్నట్టు సమాచారం ఉంది.
కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు ఇండియా మరోసారి ఈ ఘటనతో తన సత్తా ఏంటో రుజువు చేసింది. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటన జరిగింది. అప్పుడు కేవలం రెండంటే రెండే రెండు గంటల్లో చుక్కలు చూపించేసింది. లద్దాఖ్ సరిహద్దుల్లో పాంగాంగ్ ఉత్తర తీరంలోని ఫింగర్-2 సమీపంలో దురాక్రమణకు డ్రాగన్ దేశం పన్నిన కుట్రను ఇండియా సాహసోపేతంగా ఛేదించింది.
ఆగస్టు 29న లద్దాఖ్ సరిహద్దుల్లోని పాంగాంగ్ ఉత్తర తీరంలోని ఫింగర్ 2 వద్ద దురాక్రమణకు చైనా ప్లాన్ ను భారత్ తిప్పికొట్టింది. ఆగస్టు 29, ఆగస్టు 31 తేదీల్లో చైనా ఏకపక్షంగా చొరబాటుకు పాల్పడి.. నియంత్రణ రేఖ హద్దులను మార్చాలని వ్యూహం పన్నింది. అయితే దీన్ని మన బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి. చైనా కుట్రను ముందుగానే పసిగట్టిన ఇండియా.. యుద్ధ ట్యాంకులు, రాకెట్ లాంఛర్లతో దాడికి తయారైంది. భారత్ బలగాలను చూసిన చైనాకు దిమ్మతిరిగిపోయింది. కీలకమైన శిఖరాలపై మన సైన్యం ముందుగానే పాగా వేయడాన్ని చూసి షాకైంది. డ్రాగన్ కుయుక్తలను పసిగట్టిన భారత సైన్యం రెండే రెండు గంటల్లో కీలకమైన బ్లాక్‌టాప్, హెల్మెట్, మగర్, గురుంగ్ శిఖరాలను తన అధీనంలోకి తెచ్చుకుంది.