చైనా వాళ్లు మీమీద కొస్తే కాల్చిపారేయండి.. మోదీ గ్రీన్ సిగ్నల్..?

Chakravarthi Kalyan
భారత్ చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత తలెత్తుతోంది. కొన్ని దశాబ్దాలుగా మన ఆధీనంలోలేని మన ప్రాంతాలను ఇటీవల భారత సైన్యాలు పునస్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీన్ని చైనా జీర్ణించుకోలేకపోతోంది. అలాంటి ప్రాంతాల్లో భారత సైనికులపై భౌతిక దాడులకు పాల్పడుతోంది. అయితే చైనా భారత్ సరిహద్దుల్లో తుపాకీల వాడకం నిషేధం కాబట్టి.. దాడులకు ప్రతిదాడులు కేవలం భుజశక్తితోనే జరపాల్సి ఉంటుంది.

అయితే ఇటీవల చైనా సైనికులు మారణాయుధాలతో భౌతిక దాడులు చేస్తున్నారు.. దీంతో మన దేశం కూడా పునరాలోచనలో పడింది. తాజాగా.. సైన్యానికి కొత్త ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సరిహద్దుల్లో సంయమనం పాటించాలని.. కానీ మన మీదకొచ్చి ప్రాణహానికి తలపెట్టే పరిస్థితి ఉంటే మాత్రం ఉపేక్షించవద్దని కాల్చి పారేయాలని సైన్యాన్ని ఆదేశించినట్తు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే తాజాగా భారత్ జరిపిన కాల్పుల్లో ఐదుగురు చైనా సైనికులు మరణించారని వార్తలు వస్తున్నాయి.  

లద్దాఖ్ సరిహద్దుల్లో ఒక్కసారిగా చైనా సైన్యం దూసుకొచ్చిన సమయంలో భారత్ ఈ కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. చైనా దురాక్రమణను భారత సైన్యం విజయవంతంగా అడ్డుకుందని.. ఈ ఎదురుదాడిలో ఐదుగురు చైనా సైనికులు హతమయ్యారని తాజా సమాచారం బట్టి తెలుస్తోంది. అయితే.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలి కాలంలో చైనాతో సరిహద్దుల్లో భారత్ సైన్యం చాలా అప్రమత్తంగా ఉంటోంది. చైనా ఏమాత్రం తోకజాడించినా ఘాటుగానే బుద్ది చెబుతోంది.


అంతే కాదు.. కొంతకాలంగా చైనా ఆధీనంలో ఉన్న మన సొంత భూభాగాలను కూడా ఇటీవల ఇండియా స్వాధీనం చేసుకుంది. దీంతో ఇటీవల ఈ ప్రాంతాలపై భారత్ పట్టుబిగుస్తుందన్న ఆందోళనలో ఉన్న చైనా.. భారత్ సైన్యంతో దుందుకుతనంతో వ్యవహరిస్తున్నట్టు సమాచారం ఉంది. మొత్తం మీద సైన్యానికి ఇలాంటి విషయాల్లో స్వేచ్ఛ ఇవ్వడం అన్నది చాలా కీలక పరిణామంగానే చెప్పాలి. ఆగస్టు 29న లద్దాఖ్ సరిహద్దుల్లోని పాంగాంగ్ ఉత్తర తీరంలోని ఫింగర్ 2 వద్ద దురాక్రమణకు చైనా ప్లాన్ ను కూడా  భారత్ తిప్పికొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: