కేంద్రానికి షాక్.. భారత్ బంద్కు పిలుపున్చిన రైతు సంఘాలు.!
తాము బిల్లులను చదివి పూర్తిగా అర్ధం చేసుకున్నామని, కేవలం కార్పొరేట్ల కంపెనీల ప్రయోజనాలకే మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విమర్శించారు. ఈ క్రమంలో తాము చేస్తున్న ధర్నాలకు ప్రతి పక్షాలను దోషులుగా చేసి మాట్లాడటం సరైన పధ్ధతి కాదని అభిప్రాయపడ్డారు. ఇది పూర్తిగా ప్రజా ఉద్యమం అని అన్నారు. వివాదాస్పద వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయకుంటే రైతుల ఆగ్రహం చూస్తారని, వెంటనే బిల్లుని రద్దు చేయకుంటే తాము చేపట్టిన రైల్ రోకో నిరసన కార్య క్రమాన్ని మరింత పొడిగిస్తామని వెల్లడించారు.
ఇకపోతే ఈ నిరసన ప్రదర్శనలో ఏ ఇతర రాజకీయ పార్టీ జోక్యం ఉండబోదని స్పష్టం చేశారు. ఇదివరకే వ్యవసాయ బిల్లులకు నిరసనగా పంజాబ్లో SAD ఆందోళనలకు పిలుపునిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కాగా.. రైల్ రోకోలో భాగంగా పంజాబ్లో వేలాది మంది రైతులు రైల్వే పట్టాలపై అడ్డంగా పడుకుని తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 28 ప్యాసింజర్ రైళ్లను అడ్డుకున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం తమ వైఖరిని మార్చుకోనంత వరకు తమ ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో రైతులను ఉద్దేశించి మోడీ.. వ్యవసాయ బిల్లుల ప్రాధాన్యత రైతులకు వివరించాలని, ప్రతి పక్షాలు రైతులను మభ్య పెడుతున్నాయని వ్యాఖ్యానించారు. కార్మిక చట్టాలు వ్యవసాయ ఉద్ధరణ కోసం తీసుకొచ్చిన బిల్లులను మోదీ పూర్తిగా సమర్థిస్తున్నారు. ఇది కేవలం ప్రతిపక్షాల కుట్రేనని అతని వాదన.