ఘాటుగా రిప్లయ్‌ ఇచ్చిన అనుష్క !

NAGARJUNA NAKKA
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై విరాట్‌ సతీమణి, బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్కశర్మ.. ఘాటు రిప్లయ్‌ ఇవ్వడం పరిస్థితిని మరింత వేడెక్కింది. అటు గవాస్కర వ్యాఖ్యలపై విరుష్క అభిమానులు విరుచుకుపడుతున్నారు.

ఐపీఎల్‌లో ఇటీవల జరిగిన పంజాబ్‌, బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా.. కోహ్లీ ఆటతీరుపై మాజీ క్రికెట్‌ సునీల్‌ గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. కోహ్లీపై చేసిన కామెంట్‌లో గవాస్కర్‌.. అనుష్క పేరిట అనుచిత వ్యాఖ్యలు చేయడం విమర్శలకు కారణమవుతోంది. దీనిపై ఘాటుగా స్పందించిందిన అనుష్క శర్మ.. గవాస్కర్‌ వ్యాఖ్యలు అగౌరవపరిచేలా ఉన్నాయని ఆక్షేపించింది. భర్త ఆటతీరుపై మాట్లాడేందుకు అతని భార్యపై ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించింది.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌ కోహ్లీ.. బ్యాటింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లోనూ విఫలమయ్యాడు. అయితే ఆ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సునీల్‌ గవాస్కర్... విరాట్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ లాక్‌డౌన్ సమయంలో అనుష్క బౌలింగ్‌ను మాత్రమే ఎదుర్కొన్నాడంటూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై అనుష్క తీవ్రస్థాయిలో మండిపడింది.

ఈ వ్యవహారానికి సంబంధించి అనుష్క.. ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. ''మిస్టర్ గవాస్కర్.. మీ కామెంట్‌ అసహ్యకరంగా ఉంది. భర్త ఆట గురించి భార్యపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో వివరిస్తే బాగుంటుంది'' అంటూ ప్రశ్నించింది. ఇన్నేళ్లుగా కమెంటేటర్‌గా వ్యాఖ్యానించేటప్పుడు ప్రతి క్రికెటర్‌ వ్యక్తిగత జీవితాలను గౌరవించారని.. అలాంటి గౌరవమే తమకూ ఇవ్వాలని భావించలేదా? అని అనుష్క తన పోస్టులో ప్రశ్నించింది. తన భర్త ఆటతీరు గురించి మాట్లాడానికి ఎన్నో పదాలు ఉంటాయనీ... 2020 వచ్చినా మీరింకా మారలేదనీ .. గవాస్కర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది అనష్క. క్రికెట్ విషయంలోకి తనను లాగడం ఎప్పుడు మానుకుంటారనీ... తనపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం ఎప్పుడు వదిలేస్తారని ప్రశ్నించింది.

సునీల్‌ గవాస్కర్‌ చేసిన వ్యాఖ్యల పట్ల... కోహ్లీ, అనుష్క ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న గవాస్కర్‌... కాస్త హుందాగా వ్యవహరించాలని హితవు చెబుతున్నారు. కామెంటేటర్‌ హోదా నుంచి వెంటనే గవాస్కర్‌ను తొలగించాలని మరికొందరు డిమాండ్‌ చేస్తున్నారు.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: