గంజాయిపై ఆశపడ్డ పోలీసులు.. 159 కిలోలు స్వాహా చేశారు.. చివరికి..?

praveen
ఈ మధ్యకాలం లో గంజాయి వాడకం రోజు రోజుకు పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. అంతేకాదు గంజాయికి రోజు రోజుకు డిమాండ్ కూడా పెరిగిపోతుంది. గంజాయి అక్రమ రవాణా కూడా క్రమక్రమంగా పెరిగిపోతున్న నేపథ్యం లో అటు అధికారుల కు గంజాయి అక్రమ రవాణా ను పట్టుకోవడం సరికొత్త సవాల్ గా మారిపోతుంది. ఇక ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఎంతో మందిని పట్టుకొని కటకటాల వెనుక కు తోస్తున్న విషయం తెలిసిందే. నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూన్నప్పటికీ ఎక్కడ ఎవరి లో మాత్రం మార్పు రావడం లేదు.



 పోలీసుల కళ్లుగప్పి ఏదో ఒక విధంగా గంజాయి అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పోలీసులు కూడా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణా చేస్తున్న వారి దగ్గర నుంచి భారీగా గంజాయి స్వాధీనం చేసుకొని చివరికి.. అరెస్టు చేస్తున్నారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. పక్క  సమాచారం తో ఇంటిపై దాడులు చేసి ఏకంగా 160 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు  పోలీసులు. కానీ కంచె చేను మేస్తోంది.. 160 కిలోల గంజాయి కాస్త ఒక కిలో గా మారి పోయింది. గంజాయి విషయం లో అధికారుల చేతి వాటం చూపించారు




 ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు లోకి వచ్చింది. ఇటీవలే ఢిల్లీలోని జహంగీర్ పురి  పోలీసులు స్థానిక డ్రగ్ డీలర్ ఇంటిపై దాడి చేసి 160 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కానీ రిపోర్టుల్లో మాత్రం కేవలం కేజీ గంజాయ్ మాత్రమే దొరికిందని రాసారు. ఇక మిగతా గంజాయి మొత్తం పట్టుకున్న అధికారులే  అమ్మేసుకున్నారు. నిందితుని కూడా 1.5 లక్షల లంచం తీసుకుని వదిలేశారు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి రావడం తో.. అక్రమాలకు పాల్పడిన అధికారుల ను సస్పెండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: