మాతో బేరాలేవమ్మా.. తేల్చి చెప్పిన భారత్..?

praveen
భారత రక్షణ విషయం లో కేంద్ర ప్రభుత్వం ఎక్కడ వెనకడుగు వేయడం లేదు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడైతే భారత ఆర్మీ కేవలం ఆత్మ రక్షణ వ్యూహాన్ని మాత్రమే అమలు చేసింది. శత్రు దేశాల దాడి చేసినప్పుడు కేవలం ఆత్మ రక్షణ కల్పించుకునేది తప్ప.. ధీటుగా బదిలీవ్వడానికి అధికారుల నుంచి అనుమతి లభించేది కాదు. కానీ ప్రస్తుతం భారత రక్షణ కు ఎక్కడ విఘాతం కలుగుతుంది అనిపించిన  వెంటనే నిర్ణయాలు తీసుకుని సరైన బుద్ధి చెప్పేందుకు భారత ఆర్మీకి  కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి అధికారాలు వచ్చాయి. దీంతో భారత ఆర్మీ సత్తా ఏంటో చూపిస్తున్నారు సైనికులు.



 అందుకే ప్రస్తుతం చైనా కి వరుస గా షాకుల తగులుతున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందులాగా భారత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాలని చైనా  అనుకున్నప్పడికి  భారత్  ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.. చైనా అధీనంలో ఉన్న భూభాగాలను  సైతం భారత్ ఆక్రమించుకుంటూ పోతుంది. దీంతో భారత్ తో పూర్తి యుద్ధం చేద్దామా అంటే.. చైనాకు కోలుకోలేని  నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవేళ భారత్ తో  చైనా యుద్ధానికి దిగితే ప్రపంచ దేశాలు కూడా చైనా పై విరుచుకు పడే అవకాశం ఉంది.



 ఇదిలా ఉంటే ఇటీవలే ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వాన్ని భారత్ కి  కల్పించేందుకు చైనా సిఫారసు చేయాల్సి ఉండగా  బేరసారాలకు దిగింది చైనా. భారత్ కి  ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం వచ్చేందుకు సిఫారసు చేస్తామని.. పిఓకే ని వదిలి వేయాలి అంటూ చైనా బేరాలకు  దిగింది. దీంతో బేరాలు లేవు అంటూ భారత్ తేల్చిచెప్పింది. పీవోకే విషయంలో చైనా భారత్ మధ్య ఎలాంటి గొడవలు లేవని.. చైనా సరిహద్దుల్లో తలెత్తిన వివాదాల గురించి చర్చించుకుందాం అంటూ తేల్చి చెప్పింది భారత్. దీంతో చైనా కు  భారీ షాక్ తగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: