అన్నదమ్ముల కన్ను.. బాలికలు గర్భవతులయ్యారు.. కుల పెద్దలు సంచలన నిర్ణయం..?

praveen
ప్రేమ అనే ముసుగులో జరుగుతున్న ఘోరాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. ప్రేమిస్తున్నానని చెప్పి అభం శుభం తెలియని మైనర్ బాలికకు ఎరవేస్తూ  చివరికి... శారీరక అవసరాలు తీర్చుకుని నట్టేట ముంచుతున్నారు ఎంతోమంది మోసగాళ్ళు.  ఇక్కడ ఇలాంటిదే జరిగింది. అన్నదమ్ములు ఇద్దరు ఇద్దరు బాలికలను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి శారీరక కోరికలను తీర్చుకొని చివరికి గర్భవతులను చేశారు. ఇది తెలిసిన కుల పెద్దలు అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇద్దరు బాలికలను ఈ ఇద్దరు అన్నదమ్ములకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ ఈ బాల్య వివాహం గురించి పోలీసులకు తెలియడంతో రంగంలోకి దిగిన పోలీసులు... ఈ తంతు మొత్తం అడ్డుకున్నారు.




 ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. తిరుమల పాలెం పరిధిలోని ఓ గ్రామంలో ఇద్దరు మైనర్ బాలికలను అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో లొంగదీసుకుని చివరికి గర్భవతులను చేశారు. ఇక బాలికలు గర్భం దాల్చారు అన్న విషయం తెలుసుకొని ముఖం చాటేశారు యువకులు. ఈ విషయం గ్రామ పెద్దల వరకూ వెళ్ళింది. దీంతో బాలికలకు అన్యాయం జరగకుండా వారిని మోసం చేసిన వారితోనే పెళ్లి చేయాలి అంటూ గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఇక అనుకున్నదే తడవుగా అదే రోజు రాత్రి ఓ బాలిక కి యువకుడికి పెళ్లి జరిపారు.



 ఇక సోమవారం ఉదయం సమయంలో మరో యువకుడికి బాలికకు పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ అంతలోనే కొంత మంది గ్రామస్తులు నుంచి బాల్య వివాహాలు చేస్తున్నారు అంటూ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రామాలయం వద్ద జరుగుతున్న వివాహాన్ని అడ్డుకుని... మైనర్ బాలికకు  కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో గ్రామంలో స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది అనే చెప్పాలి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరింత దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: